మనలోకం ప్రత్యేకం: విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ స్మరణలో…

-

ఈయన బాల్యం నుండి ఎన్నో పద్యాలు, వ్యాసాలు, విమర్శలు రాసేవారు. వందేమాతరం గీతాన్ని రచించిన బంకించంద్ర ఛటర్జీ కూడా రవీంద్రుని ప్రశంసించారు, గ్రామ అభ్యుదయం కోసం, దేశ అభ్యుదయం కోసం పాటుపడ్డారు.

మొట్టమొదట రవీంద్రనాథ్ ఠాగూర్ వాల్మీకి ప్రతిభ అనే నాటకాన్ని రచించారు. ఆ తర్వాత అమలు అనే పిల్లవాణ్ణి గురించి పోస్టాఫీసు అనే నాటకం రాశారు. చిత్రాంగద నాటకం కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ రాసారు. ఈ నాటకానికి ఆయనకు మంచి పేరు వచ్చింది. ఇలా ఎన్నో అద్భుతమైన నాటకాలను రవీంద్రనాథ్ ఠాగూర్ రచించారు. గీతాంజలి కి నోబెల్ బహుమతి అందుకున్నారు

1861 మే 7న జన్మించారు. ఈయన తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్, తల్లి శారదాదేవి. బాల్యమంతా కూడా చాలా విచిత్రంగా గడిచింది. ఆముదం దీపం ముందు పుస్తకం పట్టుకొని కూర్చొని ఆవలిస్తూ కునికిపాట్లు పడేవారు. నిద్ర లేవగానే ఇంటి తోటలోకి వెళ్లి ప్రకృతి సౌందర్యాన్ని చూసి ఎంతగానో ఆనందించేవారు.

బాల్యం లో ఇంట్లోనే నాలుగు గోడల మధ్య ఉండవలసి రావడం వలన బయట ప్రపంచం అంటే చాలా అందంగా ఉంటుందని అనుకునేవారు. ప్రపంచమొక రహస్యమని ఆ రహస్యాన్ని ఈయన తెలుసుకోవాలని ఎంతగానో కుతూహల పడేవారు.

రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పిన కొన్ని ముఖ్యమైన వాక్యాలు:

ప్రతి గడిచిన రోజూ మనమేదైనా నేర్చుకున్నదై ఉండాలి.

ప్రేమించే వ్యక్తికి దండించే అధికారం కూడా ఉంటుంది.

అసమర్ధులకు అవరోధాలుగా కనిపించేవి సమర్ధులకు అవకాశాలుగా కనిపిస్తాయి.

కళ్లకి రెప్పలు ఉన్నట్లే పనికి విశ్రాంతి ఉండాలి.

ప్రేమ గుణం బాగా పెరిగితే లభించే సంపద-పవిత్రత.

వెలిగే దీపంలాగా ఉండు. అప్పుడే ఇతర దీపములను వెలిగించవచ్చు.

మనస్ఫూర్తిగా ప్రేమించే స్త్రీల మధ్యలో పురుషులు పసిబిడ్డలు.

నువ్వు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే విజయం పది అడుగులు ముందుకు వస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news