బ్లాక్ బాక్స్ ఆరెంజ్ కలర్ లో ఉండడానికి కారణాలు ఇవే..!

-

విమానాలు ఎన్నో రకాలుగా ఉంటాయి. వాటిని ప్రయాణించడానికి మాత్రమే కాక ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. అయితే ఎటువంటి విమానం లో అయినా బ్లాక్ బాక్స్ తప్పకుండా ఉంటుంది. సహజంగా విమానం వెనుక భాగంలో బ్లాక్ బాక్స్ ను అమర్చుతారు. దీని వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ఈ బ్లాక్ బాక్స్ ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా దృఢంగా ఉండేలా డిజైన్ చేయబడింది, అంటే విమానం నీటిలో మునిగినా, అధిక ఉష్ణోగ్రతల్లో ప్రయాణించినా, ఈ బ్లాక్ బాక్స్ చాలా బలంగా ఉంటుంది. పైగా విమానంలో జరిగే ప్రతి అంశం, రేడియో ట్రాఫిక్, పైలెట్ అనౌన్స్మెంట్ లు, ప్రైవేట్ సంభాషణలు అన్నీ ఇందులో రికార్డ్ అవుతాయి.

ఎటువంటి ప్రమాదం జరిగినా, బ్లాక్ బాక్స్ ద్వారా సమచారం తీసుకొని అనేక విషయాలను కనుగొనవచ్చు. అయితే, బ్లాక్ బాక్స్ ఆరెంజ్ రంగులో ఉంటుంది. దీనికి స్పష్టమైన కారణాలు ఉన్నాయి అని నిపుణులు చెబుతున్నారు. విమానం కూలిపోవడం లేదా మంటలు చెలరేగే సమయంలో, బ్లాక్ బాక్స్‌ను సులభంగా గుర్తించేలా ఆరెంజ రంగు ఉపయోగిస్తారు. అందుకే, అది బ్లాక్ బాక్స్ అనే పేరు ఉన్నా, నిజానికి ఆరెంజ్ రంగులో ఉంటుంది. బ్లాక్ బాక్స్ సాధారణంగా విమానం వెనుక భాగంలో అమర్చబడుతుంది, ఎందుకంటే ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా బాగా రక్షించబడటానికి ఇది అనుకూలంగా ఉంటుంది.

పైగా, దీని డేటా తొలగిపోకుండా భద్రంగా ఉండేలా రూపొందించబడింది. ఈ బ్లాక్ బాక్స్‌లో రెండు కీలక పరికరాలు ఉంటాయి ఎఫ్‌డీఆర్ మరియు కాక్‌పిట్ వాయిస్ రికార్డర్. ఎఫ్‌డీఆర్‌లో విమానానికి సంబంధించిన సమాచారం, అలాగే విమాన కదలికలు రికార్డ్ అవుతాయి. అయితే, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌లో సంభాషణలకు సంబంధించిన డేటా ఉంటుంది. ఈ రెండు పరికరాలను ఉపయోగించి, విమాన ప్రమాదం జరిగినప్పుడు దానిలో ఉండే వివరాలను అర్థం చేసుకోవడానికి బ్లాక్ బాక్స్ ఎంతో ఉపయోగపడుతుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news