ఆయన ప్రచారానికి మేనమామ.. వాస్తవానికి కంసమామ : నారా లోకేష్

-

జాతీయ సర్వే సంస్థ అసర్ నివేదికతో జగన్ పాలనలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో జరిగిన విధ్వంసం బయటపడింది అని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆయన ప్రచారానికి మేనమామ, వాస్తవానికి కంసమామ అని మరోసారి రుజువైంది. పబ్లిసిటీ కోసం వందల కోట్లు ఖర్చు చేశారే తప్ప విద్యా ప్రమాణాలు పెంచే కనీస చర్యలు తీసుకోలేదని తేటతెల్లం అయ్యింది. 2018లో నాటి టిడిపి హయాంలో మెరుగ్గా ఉన్న ప్రభుత్వ విద్యా ప్రమాణాలు వైసిపి పాలనలో ఎలా దిగజారాయో అసర్ నివేదికలో స్పష్టంగా వెల్లడించింది.

అడ్డగోలు జీవోలు తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలల మూసివేత, అక్షరాలు, అంకెలు గుర్తుపట్టలేని స్థితిలో విద్యార్థులు.. తగ్గిన హాజరు శాతం, తాగునీరు, మరుగుదొడ్లు లాంటి కనీస మౌలిక సదుపాయాలు లేవు. ఇలా అనేక అంశాలు గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని ఎండగడుతున్నాయి. ఎనిమిదో తరగతి విద్యార్థుల్లో దాదాపు సగం మంది రెండో తరగతి పుస్తకాలు సరిగా చదవలేని పరిస్థితి ఉంది. విధ్వంసానికి గురైన విద్యా వ్యవస్థను గాడిన పెట్టేందుకు గత ఏడు నెలలుగా అనేక చర్యలు తీసుకున్నాను. నిరంతరం అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలు తెలుసుకుంటూ అనేక మార్పులకు నాంది పలికాను అని నారా లోకేష్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news