దిష్టి బొమ్మను ఇంటి ముందు పెట్టడం వల్ల లాభమా? నష్టమా?

-

అవును.. దిష్టి బొమ్మ, రాక్షసుడి బొమ్మలను ఇంటి ముందు కానీ… ఇంటి పైన కానీ.. ఇంటి వెనుక కానీ.. చాలా మంది పెడుతుంటారు. అసలు దిష్టి బొమ్మను ఇంటి ముందు ఎందుకు పెడుతారు. అవి పెట్టడం వల్ల లాభమా? నష్టమా? తెలుసుకుందాం రండి.

దిష్టి బొమ్మను చాలా మంది ఇంటి ముందు.. అందరికీ కనిపించేలా పెడతారు. ఎందుకు అలా పెడతారు అంటే.. ఇంటికి దిష్టి రాకుండా పెడతాం అంటారు. ఆ ఫోటోను వేరే వాళ్లు చూస్తూ ఇంటి మీద వాళ్ల దృష్టి పడదని.. దీంతో ఇంటికి దిష్టి రాదని అంటుంటారు. కానీ.. ఇది ఎంతవరకూ కరెక్ట్ కాదు.

ఈ దిష్టి బొమ్మ మన ఇంట్లో ఉంటే.. మన నాశనాన్ని మనమే కొని, కోరి తెచ్చుకున్నటే. రాక్షసుడి బొమ్మను ఇంట్లో పెట్టుకుంటే, గుమ్మంలో పెడితే.. పైన పెడితే వెంటనే దాన్ని తీసేసి ఎవరూ తొక్కని చోట పడేయండి. ఇంటి ముందు గుమ్మడి కాయ ఉంటే చాలు. దిష్టి బొమ్మ, రాక్షసుడి బొమ్మ అవసరం లేదు.

ఇంట్లో దేవుడి ఫోటోలు పెట్టుకోవడంలో ఓ అర్థం ఉంటుంది కానీ… రాక్షసుడి ఫోటోలు పెట్టుకోవడం ఏంది. విభూతి, బొట్టు పెట్టుకున్నంత మాత్రాన రాక్షసుడు దేవుడు అవుతాడా? కాడు కదా. మిమ్మల్ని కాపాడుతాడా? రాక్షసుడు భూతప్రేతపిశాచాలను పిలుస్తాడు. తన తోటి వాళ్లను పిలుస్తాడు. ఇంట్లో స్మశానం వాతావరణాన్ని కలిగిస్తాడు. ఎటువంటి రాక్షసుల ఫోటోలైనా… దిష్టి బొమ్మలైనా వెంటనే వాటిని తీసేయండి. లేదంటే సమస్యలను మీరే కొని తెచ్చుకున్నట్టే. ఆ ఒక్క ఫోటో చాలు మీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. మీ ఇంట్లో ప్రశాంతత ఉండదు. ఎంత సంపాదించినా.. సంపాదించింది.. సంపాదించినట్టే పోతుంది. డబ్బు నిలబడదు. కుటుంబంలో ప్రేమ ఉండదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version