ఆర్‌ఆర్‌ఆర్.. గత కొన్ని రోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో దీని గురించే చర్చ. అటు తెలుగు సినీ అభిమానులు, ఇటు ఇండస్ట్రీ నటులు రాజమౌళి తదుపరి సినిమా ఆర్‌ఆర్‌ఆర్ గురించే చర్చిస్తున్నారు. అసలు ఏంటి ఈ సినిమా. కథేంటి.. సినిమా టైటిల్ ఏంటి. ఆర్‌ఆర్‌ఆర్ అంటే ఏంటి.. ఇలా వాళ్లకు వాళ్లే ప్రశ్నలు వేసుకొని సమాధానాలు వెతికే పనిలో పడ్డారు. ఎంతయినా రాజమౌళి సినిమా కదా. ఆమాత్రం ఆసక్తి ఉండటం కామన్. బాహుబలి సిరీస్ తర్వాత వస్తున్న సినిమా కూడా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. అందులోనూ ఇద్దరు స్టార్ హీరోలు ఈ సినిమాలో నటిస్తుండటం కూడా ఈ సినిమాపై అంచనాలు పెంచడానికి ఓ కారణం.
సినిమా అఫీషియల్ లాంచ్ నవంబర్ 11న ఉదయం 11 గంటలకు జరగనున్నట్లు.. దానికి సంబంధించిన టీజర్‌ను కూడా రాజమౌళి రిలీజ్ చేశాడు. అయితే.. సినిమా లాంచ్‌కు ముందే ఆ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్‌ఆర్‌ఆర్ టైటిల్ ఇదేనంటూ ఓ పేరు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రాజమౌళి సినిమా పేరు రామ రావణ రాజ్యం అట. అవును.. ఆ సినిమాలో రావణ్ పాత్రలో ఎన్టీఆర్ నటించనున్నడట. అంటే కొంచెం నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అట. అబ్బ.. చదువుతుంటేనే రోమాలు నిక్కబొడుస్తున్నాయి కదా. అవును.. ఎన్టీఆర్ ఇదివరకు జైలవకుశ సినిమాలో రావణ పాత్రలో నటించి ఎలాగూ మెప్పించాడు. దీంతో రావణ్ పాత్రలో ఎన్టీఆర్ అలవోకగా నటించే చాన్స్ ఉంది. ఇక.. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నాడట.
నవంబర్ 11న జరగబోయే ఈ సినిమా లాంచింగ్ వేడుకకు సౌత్ సినిమా ఇండస్ట్రీ కదిలి వస్తోంది. సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీ కాంత్, ప్రభాస్, ఇంకా చాలామంది నటులు, బాహుబలి సినిమా యూనిట్ ఈసినిమా లాంచింగ్ వేడుకకు హాజరుకానున్నారు. 2020లో ఈ సినిమా రిలీజ్ కానున్నట్టు సమాచారం. అఫీషియల్ లాంచ్ ప్రారంభం కాగానే సినిమా షూటింగ్ కూడా వెంటనే ప్రారంభం అవుతుందట. ఫస్ట్ షెడ్యూల్‌లో రామ్ చరణ్, ఎన్టీఆర్ పాల్గొంటారట. డీవీవీ దానయ్య నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాకు ప్రస్తుతం 300 కోట్ల బడ్జెట్ అనుకుంటున్నారు. ఏమో.. భవిష్యత్తులో నిర్మాణ వ్యయం పెరగొచ్చేమో. చూద్దాం. రామ రావణ రాజ్యం గురించి రేపే తెలియాలిక.