పిల్లలకు పాఠాలు అర్ధం కావాలని ఆ టీచర్ వేసుకొచ్చిన బట్టలు చూస్తే.. వైరల్‌ ఫోటో

-

పిల్లలకు అర్ధమయ్యే విధంగా పాఠాలు చెప్పడం అనేది టీచర్ల బాధ్యత. అందరికి త్వరగా అర్ధం కావాలని లేదు. క్లిష్టమైన పాఠాలు చెప్పే సమయంలో వారికి అర్ధమయ్యే విధంగా హావభావాలు, బాడి లాంగ్వేజ్ అనేది కూడా చాలా అవసరం. తాజాగా ఒక టీచర్ తన విద్యార్ధులకు అర్ధం కావడానికి వేసుకొచ్చిన దుస్తులు చూస్తే మతి పోవడం ఖాయం. స్పానిష్ కి చెందిన 15 ఏళ్ళ నుంచి టీచర్ గా పని చేస్తుంది. ప్రస్తుతం 3వ తరగతికి పాఠాలు బోధిస్తుంది. దీనితో ఆ చిన్నారులకు అర్ధం కావడానికి ఆమె వినూత్నంగా ప్రయత్నించింది.

వారికి ప్రస్తుతం సైన్స్, ఇంగ్లీష్, ఆర్ట్, సోషల్ స్టడీస్ మీద పాఠాలు చెప్తుంది. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం, 43 ఏళ్ళ వేరోనికా, బాడీసూట్ ధరించిన బయాలజీ క్లాస్ తీసుకున్నప్పుడు దానిపై మానవ అంతర్గత అవయవాలు ముద్రించబడ్డాయి. విద్యార్ధులు నేర్చుకోవడానికి సులభంగా ఉండటానికి గాను ఈ విధంగా క్లాస్ కి వచ్చింది. దీనిపై స్పందించిన ఆమె అంతర్గత అవయవాలను చిన్నపిల్లలు ఊహించుకోవడం ఎంత కష్టమో తనకు తెలుసని, దీనిని ప్రయత్నించడం వారికి ఉపయోగకరంగా ఉంటుందని తాను భావించినట్టు చెప్పింది.

వెరోనికా భర్త తన భార్యతో కలిసి తరగతికి వెళ్లి, ఆమె అనాటమీ చార్ట్ దుస్తులను ధరించిన కొన్ని చిత్రాలను క్లిక్ చేశాడు. వాటిని ట్విట్టర్ లో పోస్ట్ చేసాడుదీనితో సోషల్ మీడియాలో ఆమె ప్రయత్నాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు, ఈ పోస్ట్ 13,000 రీట్వీట్లు మరియు 66,000 లైక్లతో వైరల్ అయింది. దీనిపై ఆమె భర్త స్పందిస్తూ… తన భార్య వినూత్న౦గా ఆలోచించడాన్ని చూసి తాను చాలా గర్వపడుతున్నట్టు చెప్పాడు. తనకు అలాంటి భార్య ఉన్నందుకు తాను చాలా అధ్రుష్టవంతుడ్ని అని చెప్పుకొచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news