Scientific Study: పోర్న్‌ చూడటం వల్ల జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది

-

ఈ రోజుల్లో పోర్న్‌ చూసే వారి సంఖ్య బాగా పెరిగింది. వయసుతో సంబంధం లేకుండా అందరూ చూస్తున్నారు. స్త్రీలు కూడా వీటికి యట్రాక్ట్‌ అవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే చిన్నపిల్లలు కూడా ఈ వీడియోలను చూస్తున్నారు. ఇండియా పోర్న్‌ ఎక్కువ చూసే దేశాల్లో మూడో స్థానంలో ఉందంటే.. ఆలోచించండి.. ఇక్కడి ప్రజలు ఏ రేంజ్‌లో అశ్లీల వీడియోలకు బానిసలయ్యారో. వీటిని చూడటం వల్ల మెంటల్‌ ప్రెజర్‌ తగ్గుతుంది, మనసుకు హాయిగా ఉంటుంది. అన్నీ లాభాలే కదా.. నష్టాలు ఎక్కడ ఉన్నాయి అంటారేమో..! కెరీర్‌ దెబ్బతింటుంది..వీటిని కంట్రోల్‌ చేయలేనంత ఎక్కువగా చూస్తే.. మీరు వేటిమీద దృష్టిపెట్టలేరు. ఈ విషయం పక్కనపెడితే.. పోర్న్‌ ఎక్కువగా చూసేవాళ్లకు..జ్ఞాపకశక్తి దెబ్బతింటుందని తాజా అధ్యయనం చెబుతుంది.

కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన న్యూరో సైకియాట్రిస్ట్ డాక్టర్ వాలెరీ వాన్ సంచలన సమాచారాన్ని వెల్లడించారు. డ్రగ్స్ కంటే పోర్న్ వీడియోలే ఎక్కువ హానికరం అనే విషయం తెలిసిందే. ఒక వ్యక్తి అతిగా పోర్న్ వీడియోలను చూసినప్పుడు ఒక రకమైన భ్రాంతి కలుగుతుంది. దీని కారణంగా మెదడు కార్యకలాపాలు తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది వస్తువుల పేర్లు, మనుషుల పేర్లను గుర్తుంచుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తుంది. క్రమం తప్పకుండా వీడియోలు చూసే అలవాటు ఒక రకమైన ఆధారపడటానికి దారితీస్తుంది. రోజంతా ఫిజికల్ డిమాండు లేకపోయినా నిర్ణీత సమయంలో శరీరం ఉత్సాహంగా ఉండాలని కోరుకుంటుంది. అంటే అది అలవాటు అవుతుంది. దీనివల్ల శరీరాన్ని లేదా మనస్సును ఏ విధంగానూ నియంత్రించలేము. ఇది మాదకద్రవ్య వ్యసనంలాగా పనిచేస్తుంది.

కాబట్టి ఆరోగ్యంగా ఉండేందుకు జాగ్రత్తగా ఉండండి. పోర్న్ వీడియోలను క్రమం తప్పకుండా చూసే అలవాటు మీ జ్ఞాపకశక్తిని ప్రభావితం చేస్తుందని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ఇది వైవాహిక జీవితంపై కూడా ప్రభావం చూపుతుంది. ఈ కారణంగా, చాలా మంది తమ భాగస్వామి గురించి భిన్నంగా ఆలోచించడం ప్రారంభిస్తారు. అలాగే మెదడు కార్యకలాపాలు తగ్గుతాయి. మరోవైపు, డ్రగ్ అడిక్షన్ వంటి కారణం లేకుండా శరీరం ఉత్సాహంగా ఉంటుంది. కాబట్టి సమయానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news