హైదరాబాద్ లో వున్న ఈ రెస్టారెంట్ల పేర్లు ఎంత విచిత్రంగా ఉన్నాయో చూడండి..!

-

కొన్ని కొన్ని రెస్టారెంట్ల పేర్లను చూస్తే చాలా విచిత్రంగా కనబడుతుంటాయి. ఈ మధ్య కాలంలో అయితే మరీను. రెస్టారెంట్ పేర్లను ఎంతో విచిత్రంగా పెడుతున్నారు. మరి హైదరాబాద్ లో ఉండే విచిత్రమైన రెస్టారెంట్ పేర్లు గురించి ఇప్పుడు చూద్దాం.

ఉలవచారు:

ఉలవచారు అనేది ఒక వంటకం కానీ ఎంతో క్రేజీగా రెస్టారెంట్ పేరు ఉలవచారు అని పెట్టారు. నిజంగా ఇలాంటి ఫన్నీ నేమ్స్ చూస్తే అందరికీ నవ్వొస్తోంది.

వివాహ భోజనంబు:

మరొక రెస్టారెంట్ పేరు వివాహ భోజనంబు ఇది కూడా ఎంతో క్రేజీగా ఉంది పైగా ఇలాంటి పేర్లని రెస్టారెంట్ కి పెడితే క్యాచీగా ఉంటాయి జనాల్లోకి వెళ్లాలంటే ఈ పేర్లు పెడితే కచ్చితంగా సేల్స్ పెరుగుతాయి.

భోజనం:

భోజనం కూడా చాలా విచిత్రంగా ఉంది కదా సాధారణంగా ఇలాంటి పేర్లను రెస్టారెంట్లకు పెట్టరు కానీ హైదరాబాదులో ఒక రెస్టారెంట్ కి భోజనం అని పేరు.

బాబాయ్ భోజనం:

బాబాయ్ భోజనం అనేది కూడా కొత్తగా ఉంది కదా ఇది కూడా హైదరాబాద్ లో ఒక రెస్టారెంట్ పేరు.

కోడి కూర చిట్టి గారే:

కోడి కూర అనేది ఒక రెసిపీ. చిట్టి గారే అనేది కూడా ఒక రెసిపీ ఈ రెండిటినీ కలిపి పేరు కింద పెట్టేసారు.

ఘుమఘుమలు:

ఇది కూడా రెస్టారెంట్ పేరు కింద మార్చేసారు సాధారణంగా వంట బాగుంటే అబ్బా ఘుమఘుమలు వచ్చేస్తున్నాయి అంటాము. అలానే తెలుగు నెస్, రాయలసీమ రుచులు, తెలుగింటి రుచులు, చట్నీస్, వియ్యాలవారి విందు, కృష్ణ పట్నం, మాయాబజార్, తిన్నంత భోజనం, దెబ్బ రొట్టె, గోంగూర, తినేసి పో, పొట్ట పెంచుదాం ఇవన్నీ కూడా రెస్టారెంట్లు పేర్లు,

Read more RELATED
Recommended to you

Exit mobile version