ఆ దేశంలో ప్రతీ ఇంట్లో దెయ్యాలకు సెపరేట్ రూమ్స్ ఉంటాయట.. మీకు తెలుసా?

-

ప్రపంచంలోని వింతలన్నీ ప్రస్తుతం ప్రతీ ఒక్కరు ఇంటర్నెట్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో సోషల్ మీడియా యూసేజ్ బాగా పెరగగా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లోనే వైరల్ అయి ప్రతీ ఒక్కరికి తెలిసిపోతున్నది. కాగా, మనం ఇప్పుడు తెలుసుకోబోయే ఈ స్టోరీ ఓ డిఫరెంట్ ప్లేస్ గురించి.. అక్కడి ట్రెడీషన్స్ చాలా విభన్నంగా ఉంటాయట. అవేంటో ఈ స్టోరీ చదివి మీరూ తెలుసుకోండి..

భారతదేశం మాదరిగానే థాయ్‌లాండ్ దేశంలోనూ బోలెడన్నీ ఆలయాలు ఉంటాయి. అయితే, ఈ దేశంలో బౌద్ధ మతానికి చెందిన టెంపుల్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ దేశంలో రాముడు, విష్ణువును ప్రజలు పూజిస్తుండటం విశేషం. సాంస్కృతిక వారసత్వంలోనూ థాయ్‌లాండ్, భారతదేశానికి అవినాభావ సంబంధముందని చెప్పొచ్చు. థాయ్‌లాండ్ దేశ నేషనల్ బర్డ్ గరుడ పక్షి. కాగా ఇండియాలో హిందువులు భక్తితో ఆరాధించే విష్ణువు వాహనం గరుడ. ఇకపోతే గరుడ పురాణం కూడా ఇండియాలో ఉంది. మన దేశంలో భారతీయలు అత్యంత పవిత్ర గ్రంథాలుగా భావించే రామాయణం, మహాభారతం కాగా, థాయ్‌లాండ్‌లో జాతీయ గ్రంథంగా రామ్ కియన్ ఉండటం గమనార్హం. రామ్ కియన్ అనగా థాయ్‌లాండ్ భాషలో రామాయణం అని అర్థం. థాయ్‌లాండ్ ప్రజలకూ భారతీయుల మాదిరిగా నమ్మకాలు ఎక్కువే.

భారత్‌లో దాదాపుగా ప్రతీ ఇంట్లో తాము నమ్మే దేవుడికి చిన్న పూజ గది ఉంటుంది. అయితే, థాయ్‌లాండ్‌లో మాత్రం భిన్నంగా దెయ్యాలకు సెపరేట్ రూమ్ ఉంటుందట. ఆత్మల పట్ల వీరికి నమ్మకం ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే దెయ్యాలకు, ఆత్మలు కొలువు దీరి ఉండటం కోసమే సెపరేట్ రూమ్ ఏర్పాటు చేసి ఉంటారని స్థానికులు చెప్తున్నారు. ఈ కంట్రీ క్యాపిటల్ నేమ్ ప్రపంచంలోనే అతి పెద్దగా ఉండటం విశేషం. భారతీయులు కూడా థాయ్‌లాండ్ సందర్శనకు వెళ్లిన క్రమంలో అక్కడి ప్రజలను చూసి అచ్చం మనలానే ఉన్నారని అనుకుంటారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version