షాకింగ్; డేటింగ్ యాప్‌లో 8 లక్షల మంది పెళ్లి అయిన వాళ్ళే…!

-

ఎనిమిది లక్షల మంది వివాహిత భారతీయ పురుషులు మరియు మహిళలు, బెంగళూరులోని టెక్ హబ్ లో ఎక్కువగా వివాహేతర డేటింగ్ యాప్‌లో నమోదు చేసుకున్నట్లు ఒక సర్వే వెల్లడించింది. వేలాది మంది భారతీయులు నూతన సంవత్సర౦ సందర్భంగా ఎక్కువగా నమోదు చేసుకున్నారట. జనవరి మొదటి వారంలో, తిరిగి తమ పనులను మొదలుపెట్టిన తర్వాత, పిల్లల శీతాకాలపు సెలవులు ముగిసిన తర్వాత ఎక్కువగా నమోదు చేసుకున్నారట. అసలు ఈ యాప్ లో నమోదు చేసుకున్న వారి గురించి ఒక సర్వే చూస్తే,

2019 నవంబర్‌లో, ఈ యాప్‌లోకి ఎక్కువ మంది పురుషులు ఈ నగరాల నుంచి వచ్చారు. బెంగళూరు, ముంబై, కోల్‌కతా, ఢిల్లీ , పూణే, న్యూ ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, గుర్గావ్, అహ్మదాబాద్, జైపూర్, చండీగ, లక్నో, కొచ్చి, నోయిడా, విశాఖపట్నం, నాగ్‌పూర్, సూరత్, ఇండోర్, భువనేశ్వర్.

మహిళలు; బెంగళూరు, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, న్యూ ఢిల్లీ, పూణే, హైదరాబాద్, చెన్నై, గుర్గావ్, చండీగర్, అహ్మదాబాద్, జైపూర్, కొచ్చి, నోయిడా, లక్నో, ఇండోర్, సూరత్, గువహతి, నాగ్‌పూర్ మరియు భోపాల్ .

567 శాతానికి పైగా పెళ్లి అయిన వాళ్ళు మరో భాగస్వామ్యం కోసం చూస్తున్నారని ఫ్రెంచ్ ఆన్‌లైన్ డేటింగ్ కమ్యూనిటీ ప్లాట్‌ఫాం తెలిపింది. న్యూ ఇయర్ కి ఈ సంఖ్య భారీగా పెరగడం ఆశ్చర్యమని తెలిపింది. మునుపటి రెండు వారాలతో పోల్చితే, జనవరి 2020 మొదటి వారంలో, రోజువారీ సభ్యత్వాలు 300 శాతానికి పైగా పెరిగాయి. ఇంకా, జనవరి 2020 మొదటి వారంలో కొత్త సభ్యత్వాల సంఖ్య మొత్తం నెలలో 250 శాతానికి పైగా ఉంది. 2019 లో కూడా ఇలాగే నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news