షాకింగ్; జీరో బ్యాలెన్స్ ఎకౌంటు లో 80 కోట్లు…!

-

జీరో బ్యాలెన్స్ ఎకౌంటు అది… అంటే ఆ ఖాతాదారు మహా అయితే ఎంత జమ చేస్తారు…? లక్షో రెండు లక్షలో… అంతే కదా…? కాని ఆ ఖాతాలో 80 కోట్లు ఉన్నాయి. అవును నిజమే 80 కోట్లు ఉన్నాయి ఆ ఎకౌంటులో. కర్ణాటకలోని రామనగర జిల్లా చెన్నపట్టణ బీడీ కాలనీలో నివాసం ఉండే రెహానా బానో, సయ్యద్‌ మల్లిక్‌ దంపతుల ఖాతాలో ఆ నగదు ఉన్నాయి. సయ్యద్… 2015 లో తన భార్య పేరిట జనధన్ ఖాతా ఓపెన్ చేసారు.

తాజాగా సయ్యద్ కి ఒక ఫోన్ వచ్చింది. మీ భార్య రేహానా ఖాతాలో కోట్లలో నగదు ఉంది. మీరు ఇప్పటి వరకు ఆధార కార్డ్ తో మీ ఖాతాను లింక్ చేయించుకోలేదు అని, గత ఏడాది డిసెంబర్ చివరి వారంలో ఫోన్ చేసారు. వెంటనే ఆయన ఏటీఎంకు వెళ్లి స్టేట్‌మెంట్ తీసుకుని చూడగా తన భార్య ఖాతాలో 80 కోట్లు ఉన్నాయని తెలిసి షాక్ అయ్యారు. ఎలా వచ్చాయని బ్యాంకు అధికారులను వివరాలు అడిగినా ఇవ్వలేదు.

దీంతో ఏదో మోసం జరుగుతోందని భావించి, ఆదాయపన్ను విభాగం అధికారులకు సయ్యద్ ఫిర్యాదు చేయగా వారు ఆరా తీసారు. డిసెంబరు మూడోవారంలో గుర్తుతెలియని వ్యక్తి రెహాన్‌కు ఫోన్‌ చేసి ఒక ఆసక్తికర విషయం చెప్పారు. ఆన్‌లైన్‌లో చీర కొన్నారని, మీకు లాటరీ వచ్చిందన్నారు. మీ ఖాతాసంఖ్య చెబితే నగదు బదిలీ చేస్తామని చెప్పగా ఆమె ఎకౌంటు నెంబర్ చెప్పింది డబ్బులు డిపాజిట్ చేసారు.

ఆ తర్వాతే ఆమె ఖాతాలోకి మొత్తం రూ.80 కోట్లు బదిలీ చేసారని, ఆమెకు తెలియకుండానే ఆ ఖాతాను ఆపరేట్ చేసారని విచారణలో తెలిసింది. ఇందులో బ్యాంకు అధికారుల పాత్ర కూడా ఉందని… రామనగర, కనకపుర, చెన్నపట్టణ విభాగాల్లో 8 మంది వ్యక్తుల ఖాతాలకు రూ.120 కోట్ల నగదు ఇలానే బదిలీ అయ్యిందని అధికారులు గుర్తించారు. సంబంధిత అధికారులను విధుల నుంచి తప్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news