ప్రతి ఒక్కరూ ఒక్కో విధంగా ఉంటారు. మరొక వ్యక్తితో పోల్చి చూసినట్లయితే వాళ్లకి వీళ్ళకి మధ్య ఎంతో తేడాని గమనించొచ్చు. సైకాలజీ ప్రకారం కొంత మంది కొన్ని సంకేతాల ద్వారా ఇంట్రావర్ట్ అని చెప్పొచ్చు. కొంతమంది ఎవరితో అయినా ఇట్టే కలిసిపోతారు. కొంతమంది మాత్రం అస్సలు ఎవరి దగ్గర కూడా నోరు ఎత్తరు. ఎక్కడో దూరంగా కూర్చోవడం, మాట్లాడకుండా ఉండడం ఇలా చూస్తూ ఉంటారు. అయితే కొంత మంది నేను ఇంట్రావర్ట్ కాదు అని అంటారు. అయితే సైకాలజీ ప్రకారం ఇంట్రావర్ట్ అంటే ఎవరు..? ఎలాంటి సంకేతాల ద్వారా చెప్పొచ్చు అని దాని గురించి చూద్దాం.
సోషలైజేషన్ తర్వాత ఒంటరిగా టైం గడపాలని ఇంట్రావర్ట్స్ కోరుకుంటారట. అలాగే పరిస్థితుల గురించి ఎక్కువగా గమనిస్తూ ఉంటారు. అబ్జర్వేషన్ ఎక్కువ చేస్తూ ఉంటారు. అలాగే చాలామందితో పరిచయం ఏర్పడిన కూడా స్నేహితులని ఎంచుకునేటప్పుడు ఆచితూచి అడుగులు వేస్తారు. అలాగే ఇంట్రావర్ట్ ఎప్పుడు కూడా ఆలోచనల్ని, ఫీలింగ్స్ ని చెప్పకుండా రాయడం వంటివి చేస్తారు.
గ్రూప్ తో కానీ టీం తో కానీ ఉండడానికి ఇష్టపడరు. చదవడం, రాయడం, బొమ్మలు వేయడం వంటి వాటికి ఎక్కువ సమయాన్ని ఇస్తారు. అలాగే ఎక్కువ రద్దీ ఉండే ప్రదేశాల్లో అసౌకర్యంగా ఉంటుంది. ఏకాగ్రతని కూడా వాళ్ళు ఆ సమయంలో కోల్పోవచ్చు. అలాగే కొత్త వాతావరణం లో ఏమైనా చేయడానికి ముందు కొంచెం ఆలోచించి అక్కడ పరిస్థితిని అంచనా వేస్తారు. వీళ్ళు పెద్ద సామాజిక కార్యక్రమాలని ఇష్టపడరు. ఇలా ఇంట్రావర్ట్స్ లో ఈ లక్షణాలని గమనించొచ్చు.