ప్రపంచ దేశాలు కరోనా వైరస్ తో వణికిపోతోంది. చేతులు ప్రతి అర్ధగంట కు ఒకసారి శుభ్రం చేసుకొని, శానిటైజర్ రాసుకొని చాలా క్లీన్ గా ఉండాలి అంటూ వైద్యులు అందరూ సూచిస్తున్న సంగతి తెలిసిందే. ఇంతమంది ఇన్ని హెచ్చరికలు చేస్తున్నప్పటికీ కొందరు మాత్రం తమ పైత్యం ప్రదర్శిస్తూనే ఉన్నారు. టిక్ టాక్ వేదికగా ‘కరోనా ఛాలెంజ్’ పేరుతో ఒక చెత్త పని చేసింది టిక్ టాక్ స్టార్. ఆమె చేసిన పనికి నెటిజన్లు అందరూ కూడా విమర్శలు చేస్తున్నారు. ఇంతకీ ఆ టిక్ టాక్ స్టార్ ఏమి చేసిందో తెలుసా…. ఛాలెంజ్ పేరుతో ఏకంగా గలీజ్ టాయిలెట్ ని నాకేసింది. అమెరికా లోని మయామి కి చెందిన టిక్ టాక్ స్టార్ అవా లూసీ విమానంలో వెళ్తూ కరోనా ఛాలెంజ్ పేరుతో ఈ పాడు పని కి పాల్పడింది. టాయిలెట్ అంచును ఎదో ఐస్ క్రీమ్ నాకుతున్నంత ఇదిగా నాకేసి టిక్ టాక్ వీడియో పోస్ట్ చేసింది. అంతటితో ఆగకుండా బస్తీమే సవాల్ అంటూ మిగతా వాళ్లు కూడా ఈ సవాల్ చేయాలి అంటూ రెచ్చగొట్టింది. దీనితో కొందరు ఆమెను ఫాలో అయ్యి చేసారు కూడా. అయితే ఈ వీడియో పై సర్వత్రా విమర్శలు తలెత్తడం తో టిక్ టాక్ సంస్థ ఆ వీడియో ను తొలగించినట్లు తెలుస్తుంది.
మరోపక్క చైనా లో ఒక ఊళ్లో వీధి కుక్క ను చంపితే రూ. 2 వేళా నజరానా ఇస్తామంటూ ప్రకటించడం విశేషం. కుక్కలు, కోళ్ల ద్వారా కరోనా వైరస్ వ్యాపించదని ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు వైద్యులు, శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నా కొందరు ఏమాత్రం చెవినపెట్టక ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు. గాంగ్జౌ రాష్ట్రంలోని డాంగువాన్ పట్టణంలో ఈ దారుణం జరుగుతోంది. ‘బెల్ట్ లేని కుక్కలు కనిపిస్తే చంపేయండి. 200 యువాన్లు పట్టుకెళ్లండి’ అని రాసిన పోస్టర్లను కూడా ప్రదర్శించారు. దీనితో ఉన్నతాధికారులు రంగంలోకి దిగి ఈ పోస్టర్ల ను తొలగించే పనిలో పడ్డారు.