నాలుక మీద పాముతో కాటేయించుకుంటేనే వాళ్లకు కిక్కు..!

-

కొందరికి మందు తాగితే కిక్కెక్కుతుంది. మరికొందరికి అందమైన అమ్మాయిని చూస్తే కిక్కెక్కుతుంది. ఇంకొందరికి ఇంకేదో. అలా ఈ యువకులకు పాము వాళ్ల నాలుక మీద కాటేస్తేనే అంతులేని ఆనందం దొరుకుతుంది. కిక్కెక్కుతుంది. ఫుల్ ఖుషి అవుతారు. అది కూడా మామూలు గీమూలు పాము కాదు.. నాగు పాము. వెరీ డేంజరస్ పాము. ఆ పాము విషం కనీసం 20 మందిని చంపేయగలదు. ఒక ఏనుగును చంపగలదు. కానీ.. వీళ్లు మాత్రం పాము కాటుకు చావరు. అదే ఇక్కడ ట్విస్ట్. ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా. పదండి.. ఇంకాస్త ముందుకెళ్దాం.

రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు యువకుల గురించే మనం ఇప్పుడు మాట్లాడుకునేది. వీళ్లపైనే చండీగఢ్‌లోని మెడికల్ కాలేజీలో పరిశోధన కూడా చేస్తున్నారు. అసలు వీళ్లను పాము కాటు చంపకుండా మత్తెలా ఎక్కిస్తున్నదని ఆ పరిశోధన. అయితే.. ఇలా పాము విషాన్ని మత్తు కోసం వాడటం ఇది కొత్తేమీ కాదు.. ఇదంతా మాకు పాతే.. అని అంటున్నాయి ఆ యువకుల కుటుంబాలు. కానీ.. ఇప్పటి వరకు ఇటువంటి కేసులు మాత్రం నాలుగే నమోదయ్యాయట. అందుకే వీళ్లపై స్పెషల్ ఫోకస్ పెట్టి వీరిపై పరిశోధన చేస్తున్నారు. వీళ్ల కేసుకు సంబంధించిన హిస్టరీని ఇండియన్ జర్నల్ ఆఫ్ సైకలాజికల్ మెడిసిన్ సంచికలోనూ ప్రచురించారు. శాస్త్రవేత్తలు కూడా ఈ యువకులను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఈ మిస్టరీ ఎప్పుడు వీడుతుందో ఏమో..

Read more RELATED
Recommended to you

Exit mobile version