ఆ జాతి కుక్కలకు ప్రత్యేక హోదా.. ఏకంగా నేషనల్ హాలీడే ప్రకటన..!

-

కొందరికి జంతువులపై ప్రేమ ఎక్కువ. పెంపుడు జంతువుల్లో ఎంతో విశ్వాసాన్ని కలిగి ఉంటే కుక్కలు అంతే మరింత ఇష్టం. పెంపుడు కుక్కలను ఎంతో ఇష్టంగా పెంచుకుంటుంటారు. రాజభోగం అనుభవించే కుక్కలు కూడా ఉంటాయి. ధనవంతులు తమ శునకాన్ని కనకపు సింహాసనంపై కూడా కూర్చోబెట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి. కానీ ఒక దేశం శునకానికి ఏకంగా బంగారంతోనే 19 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా ఆ కుక్క కోసం ఏకంగా దేశవ్యాప్తంగా సెలవును కూడా ప్రకటించారు.

నేషనల్ హాలీడే అంటే మన దేశంలో ప్రముఖులు, మహనీయుల జయంతి లేదా వర్ధంతిని పురస్కరించుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సెలవును ప్రకటిస్తాయి. లేదా దేశవ్యాప్తం విపత్కర పరిస్థితులు, ఆందోళనలు జరిగినప్పుడు మాత్రమే తాత్కాలికంగా హాలీడేను ప్రకటిస్తాయి. కానీ తుర్క్ మెనిస్థాన్ దేశంలో ఓ కుక్క కోసం ప్రత్యేకంగా నేషనల్ హాలీడేను ప్రకటించారు. ప్రస్తుతం ఈ వార్త చర్చనీయాంశంగా మారింది.

తుర్క్ మెనిస్థాన్ దేశంలో కుక్కలను ఎంతో గౌరవంగా చూసుకుంటారు. ముఖ్యంగా అలబాయ్ జాతికి చెందిన కుక్కలకు ఆ దేశంలో ప్రత్యేక స్థానంతోపాటు గుర్తింపు కూడా ఉంటుంది. తుర్క్ మెనిస్థాన్ అధ్యక్షుడు గుర్భాంగులీ బెర్డ్ ముఖమ్మెదొవ్ కు అలబాయ్ జాతి కుక్కలంటే ఎంతో ఇష్టమంట. తనకు ఇష్టమైన ఈ జాతి శునకాన్ని ఆ దేశ రాజధాని యష్గబత్ లో నడిరోడ్డుపై బంగారంతో తయారు చేసిన 19 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో ఈ వార్త ఎంతో చర్చనీయాంశంగా మారింది.

తాజాగా అధ్యక్షుడు బెర్డ్ ముఖమ్మెదొవ్ మరో ప్రకటన చేసి వార్తల్లో నిలిచారు. ప్రతి ఏడాది ఏప్రిల్ నెల చివరి ఆదివారాన్ని నేషనల్ హాలీడేగా నిర్ణయించినట్లు వెల్లడించారు. ఆ రోజును అలబాయ్ జాతి కుక్కలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. అది కేవలం సెలవు రోజు కాదని.. ఆ రోజు ప్రత్యేకంగా అందాల పోటీలు, వివిధ రకాలు పోటీలు కూడా నిర్వహిస్తారని ఆ దేశ అధ్యక్షుడి కుమారుడు సెర్దార్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version