సమ్మర్ ఎఫెక్ట్: ఏది బెస్ట్.. ఎయిర్ కూలరా? ఎయిర్ కండీషనా?

-

ఎవ్వరిని అడిగినా ఏసీ ఈజ్ ది బెస్ట్.. అని చెబుతారు. అవునా.. ఏసీనే బెస్టా? ఎయిర్ కూలర్ కాదా? దేన్ని ఎంపిక చేసుకునేది… అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారా?

అబ్బబ్బ.. ఏం ఎండరా బాబు. తట్టుకోలేకపోతున్నాం. ఎండ భగ్గుమంటోంది. ఏం చేయాలి. బయట కాలు పెట్టాలంటేనే వణికిపోతున్నాం. మార్చిలనే ఎండలు ఇలా ఉంటే ఇక ఎప్రిల్, మేలో ఎలా ఉండాలి. వామ్మో.. ఈ ఎండలను ఎలా తట్టుకోవాలో ఏమో. ఇంట్లో కూర్చుందామన్నా.. ఉక్కపోతను భరించలేకపోతున్నాం. ఏం చేసేది దేవుడా.. అని ఊసురుమనకండి. ఎండ వేడిని తట్టుకోవడానికి మనకు ఎయిర్ కూలర్స్, ఎయిర్ కండీషన్స్ ఉన్నాయి కదా. వాటితో ఈ ఎండాకాలంలో సేద తీరండి బాస్ అంటారా?

ఓకే.. ఓకే.. అదంతా ఓకే కానీ.. ఈ రెండింట్లో ఏది బెస్ట్ అంటారు. అదేనండి. ఎయిర్ కూలర్ తీసుకోవాలా? ఎయిర్ కండీషన్(ఏసీ) తీసుకోవాలా? ఏదంటారు. అయ్యో దానికేం భాగ్యం.. ఏసీ బెస్ట్ అండి అంటారు మీరు. మీరే కాదు.. ఎవ్వరిని అడిగినా ఏసీ ఈజ్ ది బెస్ట్.. అని చెబుతారు. అవునా.. ఏసీనే బెస్టా? ఎయిర్ కూలర్ కాదా? దేన్ని ఎంపిక చేసుకునేది… అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారా?అలా అయితే ఎక్కువ మంది దేన్ని వాడితే మీరు కూడా దాన్నే వాడేయండి. ఎందుకంటే… హైదరాబాద్ లో ఉన్న జనాల్లో ఎక్కవ మంది ఏసీలను కొనడానికే ఇష్టపడుతున్నారట. అంటే వేడిని తట్టుకోలేని వాళ్లు ఎయిర్ కూలర్ కన్నా… ఏసీకే మొగ్గు చూపుతున్నారట.



ఏసీని కొనలేని వాళ్లు.. దాన్ని అద్దెకు తీసుకుంటున్నారట. అద్దెకు తీసుకునేవారి శాతం కూడా విపరీతంగా పెరిగిపోతోందట. ఇదేదో మేం చెబుతున్నది కాదు. ఆన్ డిమాండ్ సర్వీసెస్ మార్కెట్ ప్లేస్ అర్బన్ క్లాస్ అనే సంస్థ చేసిన అధ్యయనంలో వెల్లడైన నిజాలు ఇవి. హైదరాబాద్ లో ఆ కంపెనీ చేసిన సర్వే వివరాల ప్రకారం… 19 శాతం నగర వాసులు ఏసీని తీసుకుంటున్నారట. 5 శాతం మంది ఏసీలను అద్దెకు తీసుకుంటున్నారట. ఇదివరకే ఏసీలను ఫిక్స్ చేసుకున్నవాళ్లు.. ఎండాకాలం రాకముందే వాటికి సర్వీసింగ్ చేయించడం.. చిన్న చిన్న మరమ్మతులు చేయించడం చేస్తున్నారట. వాళ్లు 84 శాతం మంది ఉన్నారట. దేశవ్యాప్తంగా అత్యధిక ఏసీలను వాడే నగరాల్లో హైదరాబాద్ ఒకటట. ఒక ఇంట్లో ఒక్క ఏసీ కాదు.. రెండు మూడు ఏసీలు ఉన్నవాళ్లు కూడా ఉన్నారట. అంటే.. రూమ్ కు ఒక ఏసీ అన్నమాట.

ఏతావాతా అర్థమయ్యేదేంటంటే.. ఖర్చు ఎక్కువైనా పర్లేదు కానీ.. కూలర్లు గీలర్లు కాకుండా… ఏసీవైపే మొగ్గు చూపుతున్నారట జనాలు. కూలర్లలో నీళ్లు పోయడం.. దాన్ని అటూ ఇటూ తిప్పడం.. ఇప్పుడు కూలర్ల ధరలు కూడా బాగా పెరగడంతో.. జనాలు కూలర్ల జోలికి పోకుండా… ఏసీలనే ఇంట్లో ఫిక్స్ చేసుకుంటున్నారట. ఏసీ అయితే.. ఎంత చల్లదనం కావాలంటే అంత చల్లదనం వస్తుంది కదా. అది మ్యాటర్. సో.. మీరు దేన్ని ప్రిఫర్ చేస్తారు. ఏసీనా? కూలర్ నా?

Read more RELATED
Recommended to you

Exit mobile version