ఆ రెస్టారెంట్‌లో గోడను రుచి చూస్తారు..ఎందుకో తెలుసా?

-

గోడను రుచి చూడటం ఏంటి వింతగా అనుకుంటున్నారా..నిజంగానే ఇది ఉందండి…ఇక్కడ మన దేశంలో అయితే కాదు..అమెరికాలో ఇలా చేస్తున్నారు.ఆ రెస్టారెంట్ గురించి పూర్తీ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..విభిన్న రుచులతోఉన్న ఆహారపదార్ధాలను ఇష్టపడే ప్రజలు.. అందుకు అనుగుణంగా భోజన ప్రియులకు రకరకాల ఆహారాన్ని అందించే అనేక రెస్టారెంట్లు ..కాశ్మీర్ లో మంచుతోనే.. టేబుల్స్, చైర్స్ ఉన్న రెస్టారెంట్ భిన్నంగా ఉండి ఆసక్తిని కలిగిస్తాయి. అయితే ప్రపంచంలో ఓ రెస్టారెంట్ లో తిన్న తర్వాత.. అక్కడ ఉన్న గోడను.. నాలికతో రుచి చూసి.. ఆస్వాదించి వస్తారు. చోట ఏదైనా రోగాలు వస్తే అనే సందేహం కూడా వస్తుంది కదా..అక్కడ వింత అదే.

 

ఇది అమెరికాలో ఉంది.అరిజోనా మిషన్ అనే ఓ రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్ లో భోజనం ఎంత ఫేమస్సో.. ఇక్కడ ఉన్న గోడ కూడా అంతేకాదు.. ఫేమస్.. అందుకనే ఈ రెస్టారెంట్ లో భోజనం చేసిన తర్వాత గోడను నాలుకతో సృజిస్తారు. ఇక్కడికి వచ్చేవారు ఇలా ఎందుకు చేస్తారు అనే ప్రశ్న మీ మదిలో మెదులుతూ ఉంటుంది.పింక్ హిమాలయన్ సాల్ట్ అంటే పింక్ సాల్ట్‌తో తయారు చేశారు. అందుకనే ఈ రెస్టారెంట్ కు వచ్చేవారు.. తప్పకుండా నాలుకతో ఈ గోడను రుచి చూస్తారు.

అక్కడకు వచ్చిన కస్టమర్స్ అందరూ నాలికతో రుచి చూస్తారు అని తెలిసినప్పుడు.. చాలామంది మదిలో మరి కరోనా వంటి సమయంలో ఈ రెస్టారెంట్ కు వెళ్లడం ప్రమాదం కదా.. అందుకనే.. ఈ రెస్టారెంట్‌కి కస్టమర్స్ వెళ్లడానికి అస్సలు ఇష్టపడరని అంటున్నారు. ఎందుకంటే ఇక్కడకు వచ్చే చాలా మంది గోడను నొక్కుతారు…విచిత్రం ఏంటంటే ఎవరూ అనారోగ్యం బారిన పడలేదట..రెస్టారెంట్ యాజమాన్యం కూడా ఈ విషయాన్ని తేలికగా తీసుకున్నారు..ఏంటో ఈ జనాలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version