వైరల్ వీడియో: చేతులు శుభ్రం చేసుకుంటే ఏమి జరుగుతుందో చూపించిన టీచర్

-

కరోనా వైరస్ రావడం ఏమో గానీ చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి అని, ప్రతి అర్ధగంట కు ఒకసారి చేతులు కడుక్కోవాలి,శానిటైజర్ లు వాడాలి అంటూ ప్రపంచ వ్యాప్తంగా డాక్టర్లు అందరూ సలహాఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎదో వ్యాపారం కోసం ఇలాంటి ప్రచారం చేస్తున్నారు అని భావించేవారు కూడా లేకపోలేదు. ఈ సోప్ లు శానిటైజర్లు వాడినంత మాత్రానా ఈ కరోనా సోకకుండా ఉంటుందా అన్న అనుమానాలు జనాల్లో కలుగుతూనే ఉన్నాయి. అయితే వారి అనుమానాలకు సమాధానంగా సోషల్ మీడియా లో ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. పిల్లలు పదే పదే చేతులు కడుక్కోవాలి అని చెబుతున్నప్పటికీ పిల్లలు వినడానికి సిద్ధంగా ఉండరు. అయితే ఈ వీడియో చూస్తే మాత్రం పిల్లలు సైతం ఇట్టే అర్ధం చేసుకుంటారు. అంత వివరంగా చేతులు శుభ్రం చేసుకోకపోతే వచ్చే ఫలితాల గురించి ఆ వీడియో లో అమందా లోరెంజో అనే విదేశీ టీచర్ వివరించారు. కిండర్ గార్డెన్ టీచరైన ఆమె ఓ ప్లేటులో నీరు పోసి మిరియాల పొడిని అందులో పోశారు. ఆ తర్వాత తన చేతి వేలును నీటిలో పెట్టారు. అలా ఆమె వేలు పెట్టినప్పుడు వేలు చుట్టూ మిరియాల పొడి అలాగే ఉంది తప్ప ఎక్కడికీ పోలేదు. ఆ తర్వాత ఆమె తన వేలిని నూనెలో పెట్టారు. (ఇక్కడ నూనె అంటే… సోప్ క్రీమ్ అని చెప్పారు) ఆ వేలిని తిరిగి మిరియాల పొడి ఉన్న నీటిలో పెట్టారు. అంతే… అక్కడున్న మిరియాల పొడి మొత్తం క్షణాల్లో దూరంగా పారిపోయింది.

వైరస్‌లు కూడా సబ్బు రాసుకుంటే ఇలాగే దూరంగా పారిపోతాయని ఆమె చెప్పారు. ఈ వీడియో చూసిన పిల్లలు వావ్ సూపర్ వండర్‌ఫుల్ టీచర్ అంటూ సబ్బు చేతులకు రాసుకోవడం వల్ల, చేతుల్ని సబ్బుతో కడుక్కోవడం వల్ల ఎంత లాభమో కళ్లారా చూసి తెలుసుకున్నారు. ఇక ఈ వీడియో చూసిన పిల్లలు అందరూ కూడా చేతులు శుభ్రం చేసుకోవడమేమో గానీ ఈ ప్రయోగం మాత్రం తప్పకుండా చేసేలా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version