డింక్ లైఫ్ స్టైల్ : మార్కెట్ లోకి కొత్త తరహా బంధం, దీని కథేంటో తెలుసుకోండి

-

ఈ మధ్య సోషల్ మీడియాలో డింక్ లైఫ్ స్టైల్ గురించి ఎక్కువగా వినిపిస్తోంది. డింక్ లైఫ్ స్టైల్ అంటే ఏమిటి? కొత్త తరం జంటలు దాని వైపు ఎందుకు మగ్గు చూపుతున్నారో, ఆ తరహా బంధంలో ఉండే వెసులుబాటులు ఏంటో అలాగే సమాజానికి జరిగే నష్టం ఏంటో తెలుసుకుందాం.

Drink లైఫ్ స్టైల్  అంటే Dual Income No Kids అన్నమాట. ఒక బంధంలో ఉన్న భాగస్వాములు ఇద్దరు పని చేసుకుంటూ పిల్లల్ని వద్దనుకోవడం అన్నమాట. ఇద్దరి సంపాదనలతో జీవితాన్ని ఆనందంగా ఎంజాయ్ చేస్తూ పిల్లల జోలికి వెళ్లకపోవడం అన్నమాట.

ఈ కొత్త తరహా బంధానికి చాలా క్రేజ్ ఉంది. కొత్త తరం యువత ఈ తరహా బంధాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. పిల్లలను కంటే బాధ్యతలు ఉంటాయని, ఆ బాధ్యతలని పూర్తిగా దూరం చేసుకునే ఆలోచనతో ఈ విధమైన లైఫ్ స్టైల్ వెనకాల పడుతున్నారు.

ఐటీ రంగంలో ఉద్యోగాలు చేసే ఎంప్లాయిస్ ఎక్కువగా ఈ తరహా బంధాన్ని ఇష్టపడుతున్నారని తెలుస్తోంది.

పిల్లల్ని వద్దనుకునే కొత్త బంధాన్ని ఎంచుకోవడానికి రకరకాల కారణాలు ఉన్నాయి.

ప్రస్తుతం పిల్లల్ని పెంచటం అనేది చాలా కాస్ట్ లీగా మారిపోయింది. పెరిగిన ధరల కారణంగా భార్యాభర్తలు ఇద్దరూ మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నా కూడా పిల్లల పెరుగుదల భారంగా మారిపోతుంది. అందుకే అసలు పిల్లల్ని వద్దని అనుకుంటున్నారు.

అదీగాక కెరీర్ పట్ల విపరీతమైన వ్యామోహం పెరగడం, భర్తతో సమానంగా సంపాదించాలన్న ఆలోచన క్రమక్రమంగా ఆడవాళ్ళలా పెరగటం.. డింక్ లైఫ్ స్టైల్ ని ఆదరించేందుకు కారణాలుగా కనబడుతున్నాయి.

అయితే కొత్తజంటలు పిల్లల్ని వద్దనుకుంటే భవిష్యత్తులో మానవాళికి ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version