ఏంటి.. ఆ ఒక్క చేప రూ.3 లక్షలు..ఎందుకంత డిమాండో తెలుసా?

-

నాన్ వెజ్ ప్రియులకు రేటుతో పనిలేదు..రుచి, కడుపు నిండిందా లేదా అని మాత్రమే చూస్తారు.. ఇక చేపల విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఆరోగ్యానికి అన్ని విధాల మంచివి అందుకే ఎంత ఖర్చు అయిన ఫర్వాలేదని అరుదైన చేపలు దొరికితే పోటీ పడుతున్నారు..ఇక పులస చేప గురించి చెప్పాల్సిన పని లేదు..పుస్తెలమ్మైనా సరే పులస తినాలి. అనే నానుడి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అంతగా పులస చేప ఫేమస్. అలాగే ఒక సీజన్‌లో వేలాది రూపాయలు పెట్టి మరీ దానిని సొంతం చేసుకుంటారు. దాని రుచి కూడా ఆ రేంజ్‌లో ఉంటుంది. అయితే ఇప్పుడు ఓ చేప పులసను మించిపోయింది. దాని రేటు కూడా లక్షల్లో పలికింది.

లక్షలాది రూపాయలు పోసి దానిని కొనుగోలు చేశారు. అది ఎక్కడో కాదు ఒడిశాలోని భద్రక్ జిల్లాలోనే జరిగింది..
ఆ చేపలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి..ఔషద గుణాలు, పోషకాలు కూడా ఉన్నాయి. ఆ చేపే క్రోకర్ చేప. ఒడిశాలో మత్స్యకారుల వలకు ఈ చేప చిక్కింది. ధామ్రా నదీ సంగమ తీరంలో శుక్రవారం మత్స్యకారుడు హఫీజ్‌ ఉల్లా వేసిన వలలో 32 కిలోలు ఉన్న క్రోకర్ చేప పడింది. ఇంకేముందు ఆ భారీ జలపుష్పాన్ని చాంద్‌బాలి

చాందినిపాల్ చేపల వేలం కేంద్రంలో వేలం వేశారు. ఆ వేలంలో ముంబైకి చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ దానిని అక్షరాలు రూ.3 లక్షల 10 వేలకు సొంతం చేసుకుంది..ఈ క్రోకర్ చేప పాకిస్థాన్, బంగ్లాదేశ్, భారతదేశ తీరం వెంబడి ఉన్న పసిఫిక్ మహా సముద్రంలో ఎక్కువగా కనిపిస్తుంది. కానీ భద్రక్ ధామ్రా తీరంలో చిక్కడం విశేషం. దీనిని ఘోల్ చేప అని కూడా అంటారు. తెలియా అని కూడా అంటుంటారు. ఈ చేపలను ఎక్కువగా సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, హాంగ్‌కాంగ్, జపాన్‌ దేశాల వారు దిగుమతి చేసుకుంటుంటారు..

ఈ చేపను తినడం కన్నా కూడా మెడిసన్ తయారిలో ఎక్కువగా వాడుతారు..ఈ చేప గుండెను సీ గోల్డ్‌గా కొనియాడతారు. దీనిని ఎయిర్‌ బ్లాడర్‌తో తయారు చేసిన ప్రత్యేక దారం మనిషి గుండె ఆపరేషన్‌లో కుట్లు వేసేందుకు వినియోగిస్తుంటారు. దాంతో దీనికి గిరాకీ బాగా ఉంది. క్రోకర్‌ మొప్పలతో తయారు చేసిన దారం సాధారణ పరిస్థితుల్లో శరీరంపై కుట్లు వేసేందుకు వినియోగిస్తారు. సుమారు మూడేళ్ల క్రితం జగత్‌సింఘ్‌పూర్‌ జిల్లా పారాదీప్‌ తీరంలో క్రోకర్‌ చేప వలకు చిక్కింది. అప్పుడు దాని రేటు లక్షా పది వేల రూపాయలు పలికింది. ఈ చేపలతో సూప్ చేసుకునే తాగితే గర్భారణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. కీళ్ల నొప్పులు కూడా తగ్గుతుంటాయి..అదండి అసలు మ్యాటర్..అందుకే ఈ చేపకు అంత డిమాండ్..

Read more RELATED
Recommended to you

Exit mobile version