రూ. 72 లక్షలతో మొదలైన వేలంపాట 510 కోట్లకి చేరింది..!

-

దీనికంటే మరి ఇంకేం షాక్ ఉంటుంది..! రాజస్థాన్ లో, హనుమన్గర్ జిల్లాలో ఒక మద్యం దుకాణం ఉంది. ఉదయం 11 గంటలు మొదలు అర్ధరాత్రి వరకు ఎంతో మంది అక్కడికి వస్తారు పైగా ఆకాశాన్ని తాకే ధరలు. రూ. 72 లక్షలతో మొదలు ఇది విపరీతంగా పెరిగిపోతుంది. ఆజ్ తక్ ప్రకారం ఇక్కడ జరిగిన వేలం అర్ధరాత్రి రెండు గంటల వరకు సాగింది.

అధికంగా రూపాయలు 510 కోట్లకి ఇద్దరు మహిళలు పాడారు. అవును నిజమే 510 కోట్లు ఒకే కుటుంబం నుంచి ఇద్దరు మహిళలు దీనిని దక్కించుకున్నారు. వాళ్ళల్లో ఒకళ్ళు కిరణ్ కన్వర్. ఇటువంటివి చాలా సహజం గానే ఈ జిల్లా లో జరుగుతూ ఉంటాయి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా మాట్లాడ లేదు. ఎందుకంటే ఇంత ఎక్కువ ధర అని వాళ్ళు అసలు ఊహించుకోలేదు. అయితే వేలం పాట ఆగిపోయిన తర్వాత డిపార్ట్మెంట్ అక్కడికి వెళ్ళింది.

అయితే ఆ ఓనర్ షాపు ధర లో రెండు శాతం అధికారులకి ఇవ్వాలి. గత సంవత్సరం రూపాయలు 65 లక్షలు కి దీనిని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఈ వేలం పాట రూపాయలు 70 లక్షల తో మొదలైంది. రాజస్థాన్ లో ఇలా వేలం పాటలు జరగడం సర్వసాధారణం. 7665 షాపులకి కూడా ఇలా వేలం పాటలు జరుగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ఈ సిస్టమ్ ని గతం లో తొలగించారు. కానీ ఇప్పుడు ఉన్న సీఎం అశోక్ గెహ్లాట్ మళ్లీ దీనిని తిరిగి ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Latest news