బుల్లెట్ బైక్ కొనిస్తేనే పెళ్లి అన్న వ‌రుడు.. ట్విస్టు ఇచ్చిన వ‌ధువు

పెండ్లి మంట‌పంలో ఆగిపోయిన పెండిలు అనేకం చూశాంమ‌నం. ఎన్నో వింత‌లు, విడ్డూరాల‌తో ఆగిపోయ‌న పెండ్లిల‌ను చూసైనా కొంద‌రు మార‌ట్లేదు. దీంతో చివ‌ర‌కు పెండ్లిలు ఆగిపోతున్నాయి. బ‌రేలీలోని పర్తాపుర్‌ చౌధరీ గ్రామానికి చెందిన ఖలీల్‌ ఖాన్‌ కూతురు కుల్సుమ్‌కు అదే జిల్లాలోని మ‌రో గ్రామానికి చెందిన‌ జీషన్‌ ఖాన్‌తో పెండ్లి ఏర్పాటు చేశాడు.

పెండ్లి మంట‌పంలోకి వ‌చ్చాక త‌న‌కు బుల్లెట్ బైకు కావాల‌ని వ‌రుడు ప‌ట్టుబ‌ట్టాడు. లేదంటే బైకుకు అయ్యే రూ.2.30 ల‌క్ష‌లు ఇస్తేనే పెండ్లి చేసుకుంటాన‌ని ష‌ర‌తు పెట్టాడు. దీంతో పెండ్లి కూతురు తండ్రి అప్ప‌టిక‌ప్పుడు బంధువుల నుంచి రూ.2.30 ల‌క్ష‌లు సేక‌రించి ఇచ్చాడు.

అయితే ఇక పెండ్లి జ‌రుగుతుంద‌ని అంతా అనుకుంటుంటే.. పెండ్లి కూతురు మాత్రం షాక్ ఇచ్చింది. త‌న కండ్ల ముందే బుల్లెట్ బైక్ కోసం త‌న తండ్రిని ముప్పుతిప్ప‌లు పెట్టిన వ్య‌క్తితో తాను తాళి క‌ట్టించుకోలేన‌ని తేల్చి చెప్పింది. అయితే త‌న తండ్రి తో పాటు పెండ్లికి హాజ‌రైన బంధువులు అంతా న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం చేసినా ఆమె విన‌లేదు. చేసుకోన‌ని తెగేసి చెప్ప‌డంతో పెండ్లి ఆగిపోయింది.