సంతోషకరమైన జీవితాన్ని గడపాలంటే భార్యాభర్తల మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేకుండా, ఒకరినొకరు అర్థం చేసుకోవడంతో వారు సంతోషంగా ఉన్నారని అర్థమవుతుంది. అలాంటి జంటలు ఎప్పుడూ నవ్వుతూ, పక్కవారిని కూడా ఆనందపెట్టే స్వభావం కలిగి ఉంటారు. అలా ఎప్పుడూ నవ్వే జంటలు కేవలం వారి ఆనందాన్ని కాక ఆరోగ్యకరమైన సంబంధాన్ని, బలమైన బంధాన్ని ఏర్పరచుకుంటారు. మరి అలా ఎప్పుడూ నవ్వే జంటలకు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి అవేంటన్నది మనము చూద్దాం..
ఒకరినొకరు అర్థం చేసుకోవడం : ముఖ్యంగా భార్యాభర్త ఇద్దరు సంతోషంగా ఉన్నారంటే వారికి ఒకరి గురించి ఒకరికి దాపరికాలు లేకుండా ఉన్నారని అర్థమవుతుంది. ఇద్దరు భార్యాభర్తలు ఒకరు మరొకరిని చూసి నవ్వారు అంటే సులభంగా వేరే వారు ఆ నవ్వులో ఉన్న అర్ధాన్ని కనిపెట్టగలరు. ఒకరు జోక్ వేస్తే సరదాగా పక్కన వారి దాన్ని ఆస్వాదిస్తారు. ఇలా ఒకరినొకరు అర్థం చేసుకొని మెలగటం ఒత్తిడిని తగ్గించడమే కాక చిన్న చిన్న సమస్యలను కూడా సులభంగా ఎదుర్కొనేలా చేస్తుంది.
నిర్వహణలో నైపుణ్యం : ఇప్పుడున్న యాంత్రిక జీవితంలో భార్యాభర్త ఇద్దరు ఉద్యోగాలకు వెళ్తున్నారు ఎంతో ఒత్తిడిని లోనవుతున్నారు. వారి ఎదుట ఎన్నో సమస్యలు, నిద్రలేస్తే ప్రతిదీ సవాల్ గా కనిపిస్తుంది మరి అలాంటి ఒత్తిళ్లను ఎదుర్కోవడానికి నవ్వే వారికి మంత్రంగా ఉపయోగపడుతుంది. ఈ సవాళ్లు, సరదాగా పాజిటివ్ కోణంలో తీసుకుంటే సమస్యలను తేలిగ్గా తీసుకొని నవ్వుతో ఒత్తిడిని తగ్గిస్తారు. ఉదాహరణకు ఆఫీసులో ఉన్నప్పుడు ఎవరితోనైనా గొడవ జరిగినప్పుడు దాని గురించి ఎక్కువ ఆలోచించి ఒత్తిడికి గురికాకుండ, నవ్వుతు సరదాగా మాట్లాడి పక్కన వారితో సరదాగా గడపడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ లక్షణం వారి మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
బలమైన భావోద్వేగా బంధం : నవ్వే జంటలు తన జీవితాన్ని సరదాగా గడుపుతారు వారు చిన్న చిన్న విషయాల్లో కూడా ఆనందాన్ని వెతుక్కుంటారు. ఒక సరద ఆట కావచ్చు, ఒక సినిమా చూడడం కావచ్చు, లేదా ఒకరినొకరు ఆట పట్టించుకోవడం కావచ్చు ఇలా వారి జీవితంలో అందరిలా గడపకుండా కొంచెం కొత్తగా ఆలోచిస్తూ కొత్త కొత్త అనుభవాలను పంచుకోవడానికి ఇష్టపడతారు ఇది వారి జీవన శైలిని మరింత పాజిటివ్ చేస్తుంది .
ఆరోగ్యకరమైన జీవితం: నవ్వుతూ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్య శాస్రం చెబుతుంది. నవ్వే జంటలు ఒత్తిడి హార్మోన్లను తగ్గించే ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తాయి. ఇది రక్తపోటు నియంత్రిస్తుంది, గుండె ఆరోగ్యానికి మెరుగుపరుస్తుంది. సంతోషకరంగా నవ్వే నవ్వు ఎన్నో ప్రయోజనాలను తీసుకొచ్చి పెడుతుంది. ఒకరినొకరు నవ్వించుకుంటూ ఉండే జంటలు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు ఇది వారి జీవితంలో ఆయుష్ పెంచడమే కాక సంతోషాన్ని కూడా తెలుస్తుంది.
రోజువారి జీవితంలో చిన్న చిన్న సంతోషాలను భార్యాభర్త కలిసి పంచుకోవాలి. కలిసి ఆటలాడాలి సినిమాలు చూడడం కామెడీ కథలను చెప్పుకోవడం, సమస్యలను తేలిగ్గా తీసుకొని నవ్వులతో ఎదుర్కోవడం, ఒకరి హాస్య భావన మరొకరు అర్థం చేసుకుని గౌరవించడం చేస్తే,సంతోషం మీ సొంతం అవుతుంది. మీ భాగస్వామితో కలిసి నవ్వడాన్ని ఒక అలవాటుగా మార్చుకోండి సంతోషకరమైన జీవితాన్ని ఆస్వాదించండి.