ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫ్రెంచ్ ఫ్రైస్..!

-

చాలా మంది ఫ్రెంచ్ ఫ్రైస్ ని ఇష్టపడతారు. ముఖ్యంగా చిన్న పిల్లలు వీటిని బాగా తింటూ ఉంటారు. మామూలుగా మనం మీడియం ప్లేట్ ఫ్రెంచ్ ఫ్రైస్ ని కొనుగోలు చేయాలంటే 100 రూపాయల నుంచి 200 రూపాయల వరకు మనకు ఖర్చు అవుతుంది.

అదే ఒకవేళ ఎక్కువగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ ని కొనుగోలు చేయాలంటే 250 రూపాయల నుండి 350 రూపాయలు లోగా మనం కొనుగోలు చేసుకోవచ్చు. కానీ నిజంగా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి.

వీటి ధర రూపాయలు 14,800. నిజంగా ఇవి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫ్రెంచ్ ఫ్రైస్. ఇవి న్యూయార్క్ రెస్టారెంట్ లో ఉన్నాయి. ఈ రెస్టారెంట్ ప్రపంచంలోనే అతి ఖరీదైన బర్గర్ మరియు ఐస్ క్రీమ్ తయారు చేసి రికార్డులకెక్కింది.

ఇప్పుడు అత్యంత ఖరీదైన ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ని బంగాళదుంపలు, వెనిగర్, షాంపైన్ వంటి వాటిని ఉపయోగించి తయారు చేస్తారు.

ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ మీద 23 క్యారెట్ గోల్డ్ డస్ట్ వేస్తారు. బహుశా వాటి వల్ల వీటికి ఇంత రేటు ఉండొచ్చు నిజంగా వీటిని చూసిన ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. మీరు కనుక వీటిని చూస్తే మీరు తప్పక షాక్ అవుతారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version