గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కిన శాండ్ విచ్‌

ఇటీవలి కాలంలో యువత శాండ్ విచ్‌ను తెగ ఇష్ట‌పడుతున్నారు. ఆహార ప్రేమికుల‌కు శాండ్ విచ్‌లు అందించేందుకు రెస్టారెంట్లు పోటీ పోడుతున్నాయి. విభిన్నంగా ఉండే శాండ్ విచ్‌ల‌ను తినాలన్న కోరిక కోసం ఆహార ప్రియులు ఎంత దూరమైన వెళ‌తారు. న్యూయార్క్లోని ఓ రెస్టారెంట్ శాండ్విచ్ల తయారీలో మంచి పేరు తెచ్చుకుంది. అక్కడ విభిన్నమైన శాండ్ విచ్‌ల‌తో పాటు వాటి ధరలు కూడా ఎక్కువ‌గానే ఉంటాయి. ఆ రెస్టారెంట్ రూపొందించిన ఓ శాండ్ విచ్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు ద‌క్కించుకుంది. వివరాల్లోకి వెళితే…

aalu sandwich recipe in telugu
aalu sandwich recipe in telugu

న్యూయార్క్లోని స్రెండిప్టీ3 అనే ఓ రెస్టారెంట్ శాండ్ విచ్లను తయారు చేయటంలో చాలా పేరు సంపాదించుకుంది. ఇక్కడ తయారయ్యే శాండ్ విచ్‌లు చాలా రుచిక‌రంగా ఉంటాయి. వాటిని తినేందుకు దూరప్రాంతాల నుండి ఆ రెస్టారెంట్‌కు ఆహార ప్రియులు ఎగ‌బ‌డుతుంటారు. ప్రపంచంలో ఎక్కడ దొరకని వెరైటీ శాండ్ విచ్లు ఇక్కడ అనేకంగా ఉంటాయి. తాజాగా ఈ రెస్టారెంట్ శాండ్ విచ్ గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డుల్లో చోటు చేసుకుంది.

ఇంతకీ ఈ రెస్టారెంట్ స్పెషాలిటీ ఏమిటంటే ప్రపంచంలో ఖరీదైన వెన్న క్వీన్ టెస్సెన్షియల్ గ్రిల్ల్డ్ చీజ్ను ఈ శాండ్ విచ్ల‌ తయారీలో వాడతారు. దీనికి పైపూతగా గోల్డ్ ఫాయిల్ రాస్తారు. దీని ఖ‌రీదెంతో తెలిస్తే షాక‌వుతారు. ఈ శాండ్ విచ్ ఖరీదు అక్ష‌రాల 16వేల రూపాయలు. సాధారణంగా రెస్టారెంట్‌ల‌లో దొరికే శాండ్ విచ్ ల ధ‌ర 100 నుండి 200 రూపాయలు ఉంటాయి. గత ఏడు సంవ‌త్సరాలుగా ఇంత ఖరీదైన శాండ్ విచ్‌ను ఏ రెస్టారెంట్ త‌యారు చేయలేదు. దాంత‌తో గిన్నీస్ బుక్ నిర్వాహకులు వరల్డ్ రికార్డులో ఎక్కించారు. కాక‌పోతే దీనిని తినాలనుకునే వారు 2 రోజుల ముందు రెస్టారెంట్కు ఆర్డర్ ఇవ్వాలి. ఎందుకంటే దీనిలో వాడే పదార్ధాల‌ను వివిధ ప్రాంతాల నుండి తెప్పించి త‌యారు చేస్తారు.