ఎంబీఏ ఛాయ్‌వాలా’.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవాళ్లకు ఈ పేరుతో పరిచయం అక్కర్లేదు. అంత ఫేమస్.. ఎంబీఏ చేసి.. ఛాయ్ అమ్ముకుంటున్నా అంటూ గర్వంగా చెప్తూ అప్పట్లో సంచలనం సృష్టించాడు. అసలు పేరు ప్రఫుల్ బిల్లోర్.. కానీ ఈ పేరు ఎవరికీ తెలియదు..ఆయన స్థాపించిన ‘ఎంబీఏ ఛాయ్ వాలా’ అంటే అందరికీ తెలుస్తుంది. ఛాయ్ వ్యాపారమే ధనవంతుడిని చేసింది. రోజుకు రూ.150 సంపాదన నుంచి కోటీశ్వరుడిని చేసింది. తాజాగా ప్రఫుల్ బిల్లోర్ అలియాజ్ ఎంబీఏ ఛాయ్‌వాలా (MBA Chai Wala).. మెర్సెడెస్ బెంజ్ (Mercedes Benz) కారు కొన్నారు. సుమారు రూ.కోటి విలువైన లగ్జరీ కారును ఇంటికి తెచ్చుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఛాయ్‌తోనే క్రమంగా ప్రఫుల్ కోటీశ్వరుడిగా మారాడు.. ఆశ్చర్యంగా ఉంది కదూ..!
ఎంబీఏ చేద్దామని క్యాట్ (CAT) పరీక్ష రాశారు ప్రఫుల్ బిల్లోర్. ఆ ఎగ్జామ్‌లో ఫెయిలవటంతో ఎంబీఏ సీటు సాధించలేకపోయారు. ఆ తర్వాత ఐఐఎం అహ్మదాబాద్ క్యాంపస్ (IIM Ahmedabad)వద్ద 2017లో ఎంబీఏ ఛాయ్ వాలా పేరుతో టీ స్టాల్ ఓపెన్ చేశారు. దీంతో ఆయన లైఫ్ టర్న్ అయింది.. ఎంబీఏ ఛాయ్ వాలా.. అనే పేరు డిఫరెంట్‌గా ఉండటంతో సోషల్ మీడియాలో ఇది వైరల్ అయింది. రోజుకు రూ.150 సంపాదన నుంచి అతడి వ్యాపారం కూడా క్రమంగా విస్తరించింది. చాలా ఔట్లెట్లు ఓపెన్ అయ్యాయి. 2019-20 సంవత్సరంలో ఎంబీఏ ఛాయ్‌వాలా టర్నోవర్ రూ.3కోట్లకు చేరింది. ఈ సక్సెస్ స్టోరీ ఇంటర్నెట్లో దుమ్మురేపుతోంది.
సాధారణంగా ఎంబీఏ అంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. అయితే ఈ ‘ఎంబీఏ ఛాయ్ వాలా’లో ఎంబీఏ అంటే మిస్టర్ బిల్లోర్ అహ్మదాబాద్ ఎంబీఏ ఛాయ్ వాలా చాలా తక్కువ కాలంలోనే ఫేమస్ అయిపోయింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 50 సిటీల్లో 200పైగా బ్రాంచ్‌లు ఉన్నాయి. ఎంబీఏ ఛాయ్ వాలా అధినేతగానే కాదు.. మోటివేషనల్ స్పీకర్‌గానూ ప్రఫుల్ బిల్లోర్ ఉన్నారు. ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్నారు. మెర్సెడెస్ బెంజ్ జీఎల్ఈను ప్రఫుల్ కొనుగోలు చేశారు. ఇది 7 సీటర్ లగ్జరీ ఎస్యూవీ. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.88లక్షల నుంచి రూ.1.05కోట్ల వరకు ఉంటుంది. చేసే పని మీద శ్రద్ధ, సంకల్పం ఉంటే.. సక్సస్ సాధించండ పెద్ద కష్టమైన పనేం కాదు.. కాకపోతే కాస్త టైమ్ పడుతుంది అంతే..