భోజనం చేయడానికీ ఓ పద్దతుంది.. అది తెలుసుకోకుంటే ఎంత నష్టపోతారో తెలుసా..?

Join Our Community
follow manalokam on social media

ఏ పని చేసినా ఆ పనిమీదే దృష్టి నిలపాలని చెబుతుంటారు. ఆఫీసులో పని చేస్తూ అదే పని మీద దృష్టి నిలపడమొక్కటే కాదు, మీరే పనిచేస్తున్నా, తింటున్నా, వ్యాయామం చేస్తున్నా, బ్రష్ చేసుకుంటున్నా, ముఖం కడుక్కుంటున్నా, ఇలా ఏ పని చేస్తున్నప్పుడు దాని మీద దృష్టి పెడితే ఆ పని సరిగా జరుగుతుందని చెబుతారు. ప్రస్తుత కాలంలో చాలా మంది అలా చేయలేకపోతున్నారు. దానికి కారణం ఫోన్.. చేతిలో మొబైల్ వచ్చాక ఎప్పుడు ఏ పని చేస్తున్నారో తెలియకుండా పోయింది.

చాలా మంది తినేటపుడు తినడం గురించి ఆలోచించకుండా మరేదో ఆలోచిస్తూ, ఎంత తినాలనే విషయాన్ని కడుపు మనకి చెప్పకుండా చేస్తున్నారు. అవును, భోజనం చేయడానికీ ఓ పద్దతుంది. ఆ పద్దతి ప్రకారం భోజనం చేస్తే తిన్నది సరిగ్గా ఒంటికి పట్టి, అది మెదడుకి చేరి, మంచి ఆలోచనలు కలుగజేస్తుంది. భోజనం చేసేటపుడు పాటించాల్సిన కొన్ని పద్దతులేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మొబైల్ చూస్తూనో, టీవీ చూస్తూనో భోజనం చేయవద్దు. ఎంత తింటున్నారనేది మీకు తెలియాలి కాబట్టి, అలా చేయకపోవడమే ఉత్తమం.

అలాగే భోజనం చేస్తూ మధ్యలో లేవకూడదు. కంచం ముందు నుండి లేవకుండా ఉంటే మంచిది.

అలాగే నలుగురిలో కూర్చున్నప్పుడు ఎవరి గురించైనా మాట్లాడుతుంటే ఎంగిలి చేత్తో ఎదుటి వారిని చూపించకూడదు. అది కామన్ సెన్స్ అనిపించుకోదు.

ప్రస్తుతం పెళ్ళిళ్ళలో నిలబడి తినడం అలవాటైపోయింది కానీ, నిజానికి అలా తినకూడదట. ఏదైనా ఆస్వాదిస్తేనే ఆనందం. నిలబడితే ఆస్వాదన తగ్గిపోతుంది.

ఒకసారి ఉడకబెట్టిన ఆహారాలని మళ్ళీ మళ్ళీ వేడి చేస్తూ తినకపోవడమే ఉత్తమం. రెండు మూడు సార్లు వేడి చేసిన టీ, దాని రుచిని ఎలా పోగొట్టుకుంటుందో అలానే ఆహారాలు వాటిల్లోని పోషకాలని పోగొట్టుకుంటాయి.

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...