ప్రపంచవ్యాప్తంగా కాసులు కురిపించే ఉద్యోగాలు ఇవే..!!

-

ఏ జాబ్‌ అయినా.. పైసల్‌ కోసమే చేస్తాం.. శాలరీ లేకుండా ఉద్యోగం చేయమంటే ఎవరూ చేయరూ..అయితే జాబ్‌ను డబ్బుసంపాదించటం కోసమే చేయాలి అనుకుంటే.. మీరు సాధారణ ఉద్యోగాలు కాకుండా బాగా డబ్బులు వచ్చే జాబ్స్‌ వైపు చూడాలి..కేరీర్‌ను అలా బిల్డ్‌ చేసుకుంటే కాసుల వర్షం కురుస్తుంది. ఇంటర్‌ నుంచే మనం ఏం అవ్వాలో మనకు ఒక క్లారిటీ ఉంటే.. ఆ దిశగా అడుగులు వేయొచ్చు.. ప్రపంచంలో ఎక్కువ డబ్బులు వచ్చే జాబ్స్‌ ఇవే..అవేంటో ఒకసారి చూడండి..!

న్యూరోసర్జన్..

న్యూరోసర్జన్ అంటే నరాలకు సంబంధించిన వైద్యవృత్తి. వీళ్లది స్పెషాలిటీ రంగం. ఈ విభాగానికి చెందిన వైద్యులు అన్ని మల్టీస్పెషాల్టీ హాస్పిటల్లలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంటారు. వీళ్లు ఎంచుకున్న రంగం కూడా అంతే సెన్సిటీవ్ ఎక్కువశాతం నరాలు, మానసిక రుగ్మతలకు సంబంధించి ఉంటుంది.. అందుకే ఇది టాప్ 10 అత్యధికంగా సంపాదించే రంగంలో మొదటిస్థానంలో ఉంది. వీరి సగటు సంపాదన 381,500 డాలర్లు ఉంటుంది.

అనెస్థెసియాలజిస్ట్..,

ఈ రంగానికి చెందిన వైద్యులు సర్జరీ సమయంలో కీలకపాత్ర పోషిస్తారు. పేషంట్లకు ఆపరేషన్ నిర్వహణలో పెయిన్ కలుగకుండా ఇచ్చే మత్తు వీరి ఆధ్వర్యంలోనే జరుగుతుంది. అందుకే వీరు టాప్ 2 పొజిషన్లో ఉన్నారు. అందుకే వీరికి ఈ రోజుల్లో ప్రాధాన్యత మరింత పెరిగింది. వీరి సగటు ఆదాయం 265,000 డాలర్లు.

సర్జన్..

సర్జన్‌ను ఫిజిషీయన్ అని కూడా అంటారు. వీళ్ల నేతృత్వంలోనే సర్జరీలు చేస్తారు.. ఇందులో పీడియాట్రిక్, డెంటిస్ట్, వెటన్నరీ సర్జన్లు ఉంటారు. ఒక అధ్యయనం ప్రకారం.. ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సర్జన్లు 300 మిలియన్ల సర్జికల్ ప్రక్రియలో పాల్గొటున్నారని తెలిసింది.. ఈ జాబితాలో వీరు మూడొవ పొజిషన్లో ఉండి 251,000 డాలర్ల సగటు ఆదాయం పొందుతున్నారు.

గైనకాలజిస్టు..,

గైనిక్ డాక్టర్లు ముఖ్యంగా ప్రెగ్నెన్సీకి సంబంధించిన ప్రత్యేక వైద్యులు. వీళ్ల పొజిషన్ కూడా చాలా గౌరవప్రదమైన వృత్తివిభాగం. ఈ గైనకాలజిస్ట్లు ప్రెగ్నెన్సీ, ఇతర మహిళలకు సంబంధించిన అనారోగ్య సమస్యలకు చెందిన స్పెషలస్టిలు. వీరి సగటు ఆదాయం 235,240 డాలర్లు ఉంటుంది..

ఆర్థోడోంటిస్ట్..

ఇది కూడా మెడికల్ రంగానికి చెందిన మరో విభాగం. వైద్యరంగంలో డెంటల్‌కు సంబంధించిన స్పెషలిస్టులు ఈ విభాగంలోకి వస్తారు. వీరి సగటు ఆదాయం 228,500 డాలర్లు.

సైకియాట్రిస్ట్..

మానసిక సమస్యలకు సంబంధించిన వైద్యలు వీరు. వీరికి మార్కెట్‌లో డిమాండ్‌ బాగా ఉంది. కరోనా కారణంగా వీరివద్దకు క్యూ కట్టిన వారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. డిప్రెషన్, స్ట్రెస్‌కు సంబంధించిన వాళ్ల బాధలను ఓపికగా విని వాళ్లకు సరిపోయే ట్రీట్మెంట్ అందిస్తారు.. ఈ వైద్యుల సగటు ఆదాయం 216,090 డాలర్లు.

సీఈఓ..,

సాధారణంగా ఇది అందరికీ తెలిసిన వృత్తి విభాగమే… మనం పనిచేసే ప్రతిచోట ఆ కంపెనీకి సీఈఓ కచ్ఛితంగా ఉంటారు. సీఈఓ అంటే చీఫ్ ఎగ్జిక్యేటివ్ ఆఫీసర్. కంపెనీకి పెద్దగా ఉంటాడు. సంబంధిత విభాగంలో ఎన్నో ఏళ్ల అనుభవం తర్వాత ఈ పొజిషన్‌కు చేరుకుంటారు. వీరి సగటు ఆదాయం 200,140 డాలర్లు.

పిడియాట్రిషన్..

ఈ వృత్తి కూడా వైద్య రంగానికి చెందినది. ఈ డాక్టర్లు పిల్లల కోసం ప్రత్యేకంగా సేవలందించే వైద్యులు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్నా పిడియాట్రిషన్ సగటు ఆదాయం ఎంతంటే.. 183, 240 డాలర్లు.

డెంటిస్ట్..

డెంటిస్టులు సాధారణంగా పంటికి సంబంధించిన వైద్యులు. వీరి సగటు ఆదాయం 174, 110 డాలర్లు.

ఎయిర్ లైన్ పైలట్..

ఎయిర్ లైన్ పైలట్‌కి కూడా ఎన్నో ప్యాకేజీలతో పాటు కూడిన ఆదాయం కలిగి ఉంటారు. ఈ వృత్తి చాలా ప్రత్యేకమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పైలట్ల సగటు ఆదాయం 161,280 డాలర్లు ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version