ఈరోజుల్లో విడాకులు తీసుకోవడానికి ఇవే ప్రధాన కారణాలట..!!

-

ఉద్యోగంలో చేరేప్పుడు శాలరీ ఎంత, కంపెనీ బ్యాగ్రౌండ్‌ ఏంటి, ఉద్యోగం ఏంటి ఇవి మాత్రమే చూసుకుంటాం.. జాయిన్‌ అయ్యాక జాబ్‌ బాగుందంటే చేస్తాం.. లేదంటే.. మళ్లీ వేట మొదలుపెడతాం.. కానీ పెళ్లి విషయంలో ఇలా చేయలేం.. ఒక్కసారి స్టెప్‌ తీసుకుని ముందుకు వెళ్లామంటే..ఇక వెనక్కు తిరిగి చూసుకోవడానికి ఉండదు. బతికినంత కాలం భరించాల్సిందే.. ఉద్యోగం మానేసి వేరే ఉద్యోగంలో చేరడం వల్ల మన రెస్యూమ్‌ వెయిట్‌ పెరుగుతుంది కానీ నష్టమేమీ ఉండదు.. కానీ విడాకులు ఇచ్చేస్తే.. అది అబ్బాయి అయినా అమ్మాయినా వాళ్ల జీవితం మునపటిలా ఉండడు. అయితే విడాకులు తీసుకోవడానికి ప్రధానంగా ఉండే కారణాలు ఏంటో ఓసారి చూద్దామా..!

ప్రతి సంవత్సరం, వేలాది జంటలు తమ వివాహాన్ని రద్దు చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. అందుకు కారణాలు కూడా బలంగానే ఉన్నాయి.. అందులో మొదటిది కమ్యునికేషన్‌ గ్యాప్‌.. భార్యాభర్తల మధ్య సరైన సంభాషణ లేకపోవడం విడాకులకు సాధారణ కారణం అవుతుంది.. మీరు మీ అవసరాలు , కోరికల గురించి బహిరంగంగా, నిజాయితీగా ఉండే వాతావరణంలో మీ భాగస్వామితో మాట్లాడలేకపోతే కనెక్ట్ అవ్వడం కష్టం.

మ్యారిటల్ ఎఫైర్ కలిగి ఉండటం విడాకులకు ప్రధాన కారణాలలో ఒకటి.. జీవితంలో మీ భాగస్వామి కాకముందు అతడు లేదా ఆమెకు మరెవరితోనైనా సంబంధం ఉండవచ్చు. బ్రేకప్‌ అవ్వొచ్చు.. ఇది కామన్‌ అని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. అదేదో క్షమించరాని నేరం చేసినట్లు చూస్తే ఆ బంధాలు నిలబడవు. నీ దగ్గరకు రాకముందు ఎలా ఉందేనేది అప్రస్తుతం..నీతో జీవితం మొదలేసిన తర్వాత ఎలా ఉంది అనేది మాత్రమే ప్రస్తుతం.. కానీ గతంలో జరిగినవి తెలుసుకుని నమ్మకం లేకుండా ప్రవర్తించడం వల్ల మీ బంధం చెదిరిపోతుంది. ఏ రిలేషన్‌కు అయినా..నమ్మకం చాలా ముఖ్యం. ఆ నమ్మకం విచ్ఛిన్నమైనప్పుడు, తిరిగి నిర్మించడం చాలా కష్టం. మీరు మోసపోయినట్లయితే, మీ భాగస్వామిని మళ్లీ విశ్వసించడం మీకు కష్టంగా అనిపిస్తుంది. ఇది విడాకులకు దారి తీస్తుంది.

విడాకులకు ప్రధాన కారణం డబ్బు సమస్యలు కూడా అవుతాయి… మనిషి ఆనందంగా ఉండాలంటే..డబ్బే అక్కర్లేదు అంటారు.. కానీ ఆ డబ్బు లేకపోతే..ఏ వ్యక్తి కూడా ఆనందంగా ఉండలేరు. ఆర్థిక ఒత్తిడి ఉత్తమ సంబంధాలలో కూడా సమస్యలను కలిగిస్తుందనడంలో ఏమాత్రం ఆశ్యర్యం లేదు.

సాన్నిహిత్యం అనేది సెక్స్ గురించి మాత్రమే కాదు, ప్రేమ గురించి కూడా. మీ సంబంధంలో సాన్నిహిత్యం లేకపోవడం నిరాశ, ఒంటరితనం, ఆగ్రహం భావాలకు దారి తీస్తుంది.

దురదృష్టవశాత్తు.. ఇండియాలో గృహ హింస కేసులు ఎక్కువ.. బయటినవారు పదుల సంఖ్యలో ఉంటాయి. పడిన వారు వేలల్లో ఉన్నారు. ఈరోజుకు నాలుగు గోడల మధ్యే వారి జీవితం తెల్లారిపోతుంది. బాధను చెప్పుకోలేక భర్త చేతుల్లో దెబ్బలు తింటు అనేక రకాల చిత్రహింసలకు గురువుతున్నారు. వీటన్నింటికి విసిగిపోయిన వారు మాత్రమే విడాకులను ఎంచుకుంటున్నారు.

సాధారణంగా..భార్యభర్తల మధ్య మూడో వ్యక్తి తలదూర్చకూడదు అంటారు.. కానీ మీ బాధను వేరేవాళ్లతో షేర్‌ చేసుకున్నప్పుడు మీరు చేసేది తప్పా లేక జరుగుతుంది తప్పా అనేది తెలుస్తుంది. పెళ్లైతే స్నేహ బంధాలను వదిలేయకండి.. కమ్యునికేషన్‌ గ్యాప్‌ రావొచ్చు.. కానీ వాళ్లు పరాయివాళ్లైతే కారు కదా..! కొన్ని కష్టాలు అటు భర్తకు, ఇటు ఇంట్లో వాళ్లకు చెప్పుకోలేం.. అలాంటప్పుడు ఒక మంచి స్నేహితురాలు లేదా స్నేహితుడు ఉంటే బాగుండు అనిపిస్తుంది. అలా అని వారి సలహాలను గుడ్డిగా నమ్మొద్దు. ఏది ఏమైనా.. విడాకులు తీసుకోవడం ఎవరి జీవితానికి ప్రశాంతతను ఇవ్వదు. బంధం నిలబడాలంటే.. కొన్నిసార్లు తగ్గాలి..అది భర్తైనా, భార్యైనా.. కానీ పైన చెప్పిన వాటిల్లో గృహహింస తప్ప వేరే ఏ కారణాలైనా మాట్లాడుకోని సర్దిచెప్పుకోని ముందుకెళ్లొచ్చు. కానీ గృహహింసకు గురైతే మాత్రం మీకు ఆ బంధం అవసరం లేదు.. మీ జీవితాన్ని మీరే చూసుకోవడం మంచిదనేది నిపుణుల సలహా.!

Read more RELATED
Recommended to you

Exit mobile version