మరి కొద్ది రోజుల్లో చనిపోతారు అనడానికి సంకేతాలు ఇవే..!!

-

పుట్టిన వాళ్ళు చనిపొక తప్పదు..అలాగే చనిపోయిన వాళ్ళకు మళ్ళీ జన్మ కూడా ఉంటుంది..చావు పుట్టుకలు అనేవి సహజం..ఈ విషయం పై భగవద్గీతలో శ్రీకృష్ణుడు,అర్జునుడుకు హిత బోధ చేస్తాడు..వాస్తవానికి పుట్టుక, మరణం రెండూ జీవితంలో భాగాలే.. మరణం అనేది జీవితంలోని చేదు నిజం.. ప్రతి ఒక్కరూ దానిని స్వీకరించాల్సిందే. ఒక వ్యక్తి ఎప్పుడు, ఎలా చనిపోతాడో ఇప్పటి వరకు ఎవరూ స్పష్టంగా చెప్పలేరు. ఇప్పుడు ఒక కొత్త అధ్యయనం మరణం సంకేతాల గురించి సంచలన విషయాలను బహిర్గతం చేసింది. మృత్యువు రాకముందే.. మృత్యువు సంకేతాలు ఒకటి కాదు అనేక రకాలుగా రావడం ప్రారంభమవుతుందని శాస్త్రవేత్తలు పరిశోధనలో గుర్తించారు.

 

వైద్యరంగంతో సంబంధం ఉన్న చాలా మంది వ్యక్తులు ఈ సంకేతాలను అర్థం చేసుకుంటారు.. మరికొందరు దీనిని కొట్టిపారేస్తుంటారు. సాధారణంగా చాలామందికి మృత్యువు సంకేతాలు తెలియవు. తమ ప్రియమైన వారు అకస్మాత్తుగా మరణించినప్పుడు శోకసంద్రంలో మునిగిపోతుంటారు.. అయితే చనిపొవడానికి రెండు వారాల ముందే కొన్ని సంకేతాలు తెలుస్తాయని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎవరైనా మరణం సమీపిస్తున్నప్పుడు అతని ఆహారం, పానీయం తగ్గుతుంది. ఆ వ్యక్తి మునుపటి కంటే తక్కువగా మాట్లాడటం ప్రారంభిస్తాడు. అదే సమయంలో చిన్న వయస్సులోనే మరణం వైపు పయనిస్తున్న పిల్లలు ఎక్కువగా మాట్లాడటం, తినడం ప్రారంభించవచ్చని తెలిపింది. ఈ అసాధారణ లక్షణాలు భవిష్యత్తులో ఏదో చెడు జరగబోతోందనడానికి సంకేతం..

ఒక వ్యక్తి చనిపోవటానికి 2 వారాల ముందు లక్షణాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. ఈ దశలో వ్యక్తి అన్ని సమయాలలో అలసటగా నిర్జీవంగా ఉంటాడు. చాలా బలహీనంగా కనిపిస్తాడు. అతను కోరుకున్నప్పటికీ మంచం విడిచిపెట్టడానికి ధైర్యం చేయలేడు. అతని నిద్ర-మేల్కొనే విధానం కూడా మారుతుంది. ఈ సమయంలో మరణానికి దగ్గరిగా ఉండే వారి ఆకలి, దాహం బాగా తగ్గుతుంది. అతని గుండె కొట్టుకోవడం, రక్తపోటు, శ్వాస తీసుకోవడం పై పలు మార్పులు కనిపిస్తాయి..

అంతేకాదు మృత్యువు దగ్గరలో ఉన్నప్పుడు తన గురించి మరచిపోయే అవకాశం ఉంది. ప్రజలు అడిగేదానికి అతను ఖచ్చితంగా స్పందించలేడు. ఇంకా పలు విషయాల గురించి స్పష్టంగా మాట్లాడలేడు. అతను మరణించే సమయం దగ్గరపడుతున్న కొద్దీ, అతని చేతులు, కాళ్ళపై, అతని మోకాళ్లపై చర్మం నీలిరంగు-ఊదా రంగులోకి మారవచ్చు.

మూత్రవిసర్జన, ప్రేగు కదలికలు ఆగిపోవచ్చు. లేదా వారే ఆపవచ్చు. వారి శరీర ఉష్ణోగ్రత తగ్గవచ్చు. వారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలవుతుంది. అలాంటి సమయంలో దగ్గరి బంధువులు వారి దగ్గరికి చేరుకుని వారి గురించి ప్రార్థించడం మంచిదని..మనం లేకున్నా మన వాళ్ళు ఆరోగ్యంగా, ఆర్థికంగా వుండాలని కోరుకోవాలని పెద్దలు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version