లైఫ్‌లో సక్సస్‌ అవ్వాలంటే రతన్‌ టాటా చెప్పిన సూక్తులు ఇవే

-

రతన్‌ టాటా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. భారత ఆర్థిక ప్రపంచానికి రతన్ టాటా నిస్సందేహంగా పాలకుడు.. కరోనా సమయంలో పెద్ద పెద్ద కంపెనీలు సైతం జీతాలు ఇవ్వలేక ఉద్యోగులను తొలగిస్తే.. పిలిచి మరీ ఉద్యోగాలు ఇచ్చిన గొప్ప వ్యక్తి టాటా.. దానంలో కర్ణుడు లాంటివారని మన అందరికి తెలుసు. జీవితంలో విజయం సాధించిన వారిని మాటలు ముందు తరం వారికి ఎంతో ఉపయోగపడతాయి.. లైఫ్‌లో సక్సస్‌ అవ్వాలంటే టాటా చెప్పిన స్ఫూర్తిదాయకమైన అంశాలు ఇవే..!!
మన మూడ్‌ను ఇతర వ్యక్తులు పాడు చేస్తుంటారు అని అనుకుంటారు.. కానీ అది తప్పు.. మన సొంత ఆలోచనలే మూడ్‌ను చెడగొడతాయి అని టాటా అంటున్నారు.. కాబట్టి ఓవర్‌థింకింగ్‌ను మానేయాలి.
జీవితంలోని ఒడిదుడుకులు జీవితంలో ముందుకు సాగేందుకు, విజయపు మెట్లు ఎక్కేందుకు మనల్ని ప్రేరేపిస్తాయి. ఎందుకంటే ECGలో కూడా ఒక సరళరేఖ జీవిత ముగింపుని చూపుతుంది.
వైఫల్యానికి ఎప్పుడూ భయపడవద్దు. జీవితంలో విజయాన్ని రుచి చూడడానికి, ముందుకు సాగడానికి వైఫల్యం ఉత్తమ మార్గం. తప్పుల నుంచే మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటాం.
విధికి విషయాలను వదిలివేయడాన్ని నేను నమ్మను అంటున్నారు టాటా.. కష్టపడి, సన్నద్ధతను నమ్ముతారట. మనం ఏం చేయకుండా అంతా దేవుడే చూసుకుంటాడు అనుకోవడం తప్పు.
తమ సహాయకులు మరియు మిత్రుల కంటే మెరుగైన వ్యక్తులతో తమను తాము చుట్టుముట్టేవారే ఉత్తమ నాయకులు. ఒక నాయకుడు ఎల్లప్పుడూ తనతో ముందుకు సాగడానికి ప్రతి ఒక్కరినీ అనుమతించాలి.
మీరు కలతో ప్రారంభించి, అభిరుచితో పని చేస్తే, విజయం వస్తుంది. అంటే మీ చిన్న కలను నెరవేర్చుకోవడానికి ఉత్సాహంగా పనిచేసినప్పుడే విజయం సాధించవచ్చు.
విజయం సాధిస్తే.. మనలో ధైర్యం పెరగాలి కానీ.. గర్వం రాకూడదు.. అలాగై ఏదైనా వైఫల్యం వచ్చినప్పుడు మనలో ఆలోచన శక్తి పెరగాలి గానీ దాని వల్ల మనసు పాడుచేసుకుని అక్కడే ఆగిపోకూడదు. వైఫల్యాన్ని ఆనందంతో అంగీకరించి, విజయం సాధించేందుకు మళ్లీ ప్రయత్నించాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version