పొట్టిగా ఉన్నవారు తాము వేసుకునే అవుట్ ఫిట్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. పొట్టిగా ఉండటం నేరమేమీ కాదు, దాని గురించి దిగులు చెందాల్సిన పని అస్సలు లేదు. అయితే.. మీరు పొట్టిగా ఉన్నా కూడా అవతలి వాళ్లకు అలా కనిపించకుండా ఉండాలంటే మీరు వేసుకునే అవుట్ ఫిట్ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అవతలి వాళ్లకు మీరు పొడవుగా కనిపిస్తారో ఇక్కడ తెలుసుకుందాం.
మీ ప్యాంటు రంగు, షూ రంగు ఒకేలా ఉండాలి:
మీరు పొడవుగా కనిపించాలంటే మీరు వేసుకున్న ప్యాంటు ఏ కలర్ లో ఉందో ఆ కలర్లోనే మీరు వేసుకునే షూ కూడా ఉండాలి. మీరు డార్క్ కలర్ జీన్స్ వేసుకుంటే డార్క్ కలర్ షూస్ తీసుకోవడం మంచిది. దీనివల్ల మీ కాళ్లు మరింత పొడవుగా కనిపించి మీరు అవతలి వాళ్లకు పొట్టిగా అనిపించరు.
బెల్ట్ అసలే వద్దు:
పొడవుగా కనిపించాలని మీరు అనుకుంటే బెల్టు వాడకండి. బెల్ట్ కారణంగా మీరు పొట్టిగా కనిపించే అవకాశం ఉంది. ఒకవేళ నిజంగా బెల్ట్ పెట్టుకోవాలనుకుంటే.. మామూలు బకెల్, మందం తక్కువుండే బెల్టు వాడటం మంచిది. అది కూడా మీరు వేసుకున్న డ్రెస్ కలర్ కి మ్యాచ్ అయ్యేలా ఉంటే బాగుంటుంది.
షార్ట్ హ్యాండ్స్ వద్దు:
షార్ట్ హాండ్స్ కన్నా ఫుల్ హాండ్స్ వేసుకుంటే మీరు పొడవుగా కనిపిస్తారు. షార్ట్ హ్యాండ్స్ వల్ల మీ చేతులు చిన్నవిగా కనిపించే అవకాశం ఉంది. అందుకే ఫుల్ హాండ్స్ ఎంచుకోండి.
ఓవర్ సైజ్ కి దూరం:
ఈమధ్య యువత ఎక్కువగా ఓవర్ సైజ్ ఫ్యాషన్ కి వెళ్తున్నారు. పొట్టిగా ఉన్నవారు ఓవర్ సైజ్ ఫ్యాషన్ ట్రై చేస్తే మరింత పొట్టిగా కనిపించే అవకాశం ఉంది. కాబట్టి మీ శరీరానికి సరిపోయే ఫ్యాషన్ ఎంచుకోండి.
క్యాప్ చేసే మాయాజాలం:
అవుట్ ఫిట్ అంతా సెట్ అయిన తర్వాత వీలైతే తల పైన క్యాప్ ధరించండి. క్యాప్ వల్ల మీరు అవతలి వాళ్లకు పొట్టిగా కనిపించరు.