ఇంట్లో ఏం లేనప్పుడు తాళం ఎందుకు వేశారు..? డిప్యుటీ కలెక్టర్ కు దొంగ రాసిన లేఖ..!

డిప్యూటి కలెక్టర్ కదా..గట్టిగా కన్నం వేయాలనుకున్నారు ఆ దొంగలు.. అనుకున్నట్లే వెళ్లారు..కానీ అక్కడ విలువైన వస్తువులు కానీ డబ్బుకానీ దొరకకపోవటంతో నిరాశతో దొంగలు ఓ లెటర్ రాసి టేబుల్ మీద పెట్టి వచ్చారు. అది చూసిన డిప్యూటి కలెక్టర్ ఆశ్యర్యానికి గురైయ్యారట. . భూపాల్ లో జరిగిన ఈ ఘటన పూర్తివివరాలు ఇలా ఉన్నాయి.
theif letter to Deputy Collector
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఉన్న త్రిలోచన్ సింగ్ గౌడ్ అనే డిప్యూటీ కలెక్టర్ ఇంటిపై కొందరు దొంగలు కన్నేశారు. ఆయన ఇంట్లో లేని సమయం చూసి చోరీకి పాల్పడ్డారు. డిప్యూటీ కలెక్టర్ ఇల్లు కదా.. అందులో ఎంతో డబ్బు, ఇతర విలువైన వస్తువులు ఉంటాయని బోలేడు ఆశలతో దొంగలు వెళ్లారు.
కానీ లోపల వాళ్లు ఊహించిన దానికి పూర్తి భిన్నంగా ఉంది పరిస్థితి. కేవలం రూ. 30 వేల విలువ చేసే వస్తువులు మాత్రమే లభించాయి. అంతే ఆ దొంగలకు ఎక్కడ లేని బాధవచ్చేసింది. కనీసం కోటిరూపాయలైనా వస్తాయ్ అనుకున్నారేమో..30వేలు వచ్చేసరికి ఓ పక్క కోపం, మరో పక్క బాధ రెండూ వచ్చేశాయి. తమ ఆగ్రహాన్ని ఆపుకోలేకపోయారు. వెంటనే ఓ లేఖ రాసి ఆ ఇంట్లోని టేబుల్ మీద పెట్టారు. ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇంటికి ఎందుకు తాళం వేశారు అంటూ అందులో ఆ దొంగలు రాయటం హైలెట్.
దొంగలు వెళ్లిపోయిన తరువాత ఇంటికి వచ్చిన డిప్యూటీ కలెక్టర్.. ఇంటి తలుపులు తీసి ఉండటం చూసి తన ఇంట్లో చోరీ జరిగిందని నిర్ధారించుకున్నారు. అదే సమయంలో తన ఇంట్లో ఆ దొంగలు రాసి లేఖను చూశారు. ఈ విషయం తెలుసుకుని రంగంలోకి దిగిన పోలీసులు.. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని డిప్యూటీ కలెక్టర్‌కు తెలిపారు. అయితే దొంగలు రాసిన లేఖ గురించి తెలుసుకున్న చాలామంది నవ్వు ఆపుకోలేకపోయారు.
అయినా డిప్యుటీ కలెక్టర్ ఇంటికే కన్నం వేయాలనుకున్నారంటే..ఆ దొంగలు ఎంత రాటుతేలినవాళ్లో అర్థమవుతుంది. అందుకే ఏమి దొరక్కా ఆ లెటర్ పెట్టినట్లు ఉన్నారు. పోలీసులైతే వాళ్లను ఎలా అయినా పట్టుకుంటాం అన్నారు. ఒకవేళ వాళ్లు దొరకితే..డిప్యూటి కలెక్టర్ ఎలా రియాక్ట్ అ‌వుతారో..!
– Triveni Naidu