రాజమౌళి ‘ఈగ’ కంటే పవ‌ర్‌ఫుల్ అండ్ పాపుల‌ర్‌ ఈ తేనెటీగ.. ఎందుకంటే..?

-

ఎస్.ఎస్.రాజమౌళి ద‌ర్శ‌క‌త్వంలో నేచుర‌ల్ స్టార్ నాని, స‌మంత ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన ఫాంట‌సీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ఈగ‌. ప్రపంచవ్యాప్తంగా జూలై 6,2012న విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ విజ‌యాన్ని సాధించింది. అయితే ఈ ఈగని మించిన ఓ పావ‌ర్‌ఫుల్ అండ్ పాపుల‌ర్ తేనెటీగ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా లో చక్కెర్లు కొడుతోంది. రోజు రోజూ తన ఫాలోవర్లను పెంచుకుంటూ హాలీవుడ్ స్టార్లకే వణుకు తెప్పిస్తోంది. 7 నెలల క్రితం ‘bee_nfluencer’ పేరుతో ఇన్‌స్టాలోకి ప్రవేశించిన ఈ తేనెటీగ అనతికాలంలోనే బీభత్సమైన ఫాలోవర్లను ఏర్పరుచుకుంది.

ఈ తేనెటీగ చక్కా మనుషుల మాదిరి సోఫాలో కూర్చుంటుంది. మంచి చిత్రాలు గీస్తుంది. ఈత కొడుతుంది, కంప్యూటర్, ఫోన్ ఆపరేట్ చేస్తుంది. ఇలా ఇంకా ఎన్నెన్నో పనులు చేస్తుంది. అలాగే నవ్వు తెప్పించే ఫొటోలతో ఎప్పటికప్పుడు మనసు దోచుకుంటూనే ఉంటుంది. పైగా, దీనికి ప్రపంచ పర్యటన చేయాలనే ఆశ కూడా ఎక్కువే అనిపిస్తుంది. ఏ ఫొటోలో చూసినా ఏదో ఒక పర్యాట ప్రాంతంలో సేద తీరుతూ, సెల్ఫీలు తీసుకుంటూ కనిపిస్తుంది.

అప్పడప్పుడు సూట్‌కేసులు పట్టుకుని, కొన్నిసార్లు తలపై క్యాప్ పెట్టుకుని.. ఒకటేమిటీ, ఇలా చెప్పుకుంటూ పోతే దీని వేషాల జాబితా చాంతాడంత అవుతుంది. దీని వేషాల‌తో ఇప్ప‌టికే 2.26 లక్షల మంది ఫాలోవర్ల‌ను సంపాందించుకుంది. అయితే కొందరు ఈ తేనెటీగ ప్రొఫైల్‌ను మొదలు పెట్టి విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ అకౌంట్‌కు ఫాలోవర్లు పెరిగితే డబ్బులు వస్తాయని, ఆ మొత్తాన్ని తేనెటీగలను పరిరక్షించేందుకు ఉపయోగిస్తామని ఆ తేనెటీగ సృష్టికర్తలు తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news