ఆ దేశంలోని పట్టణంలో కేవలం రూ.12కే ఇంటిని విక్రయిస్తున్నారు.. ఎందుకంటే..?

-

ఎటు చూసినా కట్టి పడేసే పచ్చని ప్రకృతి అందాలు. కట్టి పడేసే ముగ్ధ మనోహర ప్రకృతి రమణీయ దృశ్యాలు. నీలి రంగులో కనువిందు చేసే సముద్రాలు. ఒక్క మాటలో చెప్పాలంటే చాలా ఆహ్లాదకరమైన వాతావరణం. కాలుష్యానికి, ఉరుకుల పరుగుల బిజీ నగర జీవితానికి దూరంగా ఓ అందమైన ప్రదేశం అది. అలాంటి వాతావరణంలో నివసిస్తే ఎలా ఉంటుంది ? జీవితంలో అంతకు మించి ఎవరికైనా ఇంక కావల్సిందేముంటుంది. అయితే అలాంటి వాతావరణంలో అత్యంత తక్కువ ధరకే ఇల్లు లభిస్తే ? అంతకు మించిన అదృష్టం మరొకటి ఉండదు కదా. అవును. ఆ దేశంలోని ఆ పట్టణంలో సరిగ్గా ఇలాంటి ఆఫర్‌నే అందిస్తున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..

క్రొయేషియాలోని లెగ్రాడ్‌ అనే పట్టణం పచ్చని ప్రకృతికి, ఆహ్లాదకరమైన వాతావరణానికి పెట్టింది పేరు. అక్కడ జనాభా విపరీతంగా తగ్గుతోంది. అక్కడ ప్రస్తుతం ఎటు చూసినా ఖాళీ ఇళ్లే కనిపిస్తున్నాయి. దీంతో ఆ దేశ ప్రభుత్వం అక్కడి ఇళ్లను చాలా చవకగా అమ్మేందుకు నిర్ణయించింది. ఈ క్రమంలోనే అక్కడ ఒక్కో ఇంటిని ఒక కునా (దాదాపుగా రూ.12)కు విక్రయిస్తోంది. ఎవరైనా సరే ఆ మొత్తం చెల్లించి అక్కడ ఇంటిని కొనుగోలు చేయవచ్చు.

ఇక అక్కడ ఇంటిని కొనుగోలు చేసేవారికి ఆ ప్రభుత్వం ఇంటి రిపేర్‌కు 25వేల కునాలను చెల్లించనుంది. కానీ అక్కడ కనీసం 15 ఏళ్ల పాటు నివసించాలి. అలాగే ఇళ్లను కొనేవారి వయస్సు 40 ఏళ్ల లోపు ఉండాలి. ధనవంతులు అయి ఉండాలి. ఈ రూల్స్‌కు ఓకే అయితే అక్కడ ఇంటిని కొనుగోలు చేసి దర్జాగా ఉండవచ్చు. రోజూ పచ్చని ప్రకృతిలో కాలం గడపవచ్చు. ఇప్పటికే అక్కడ 17 ఇళ్లను విక్రయించారు. ఇంకా ఖాళీగానే ఇళ్లు ఉన్నాయి. మరి ఆసక్తి ఉన్నవారు ఒక్క లుక్కేయండి..!

Read more RELATED
Recommended to you

Exit mobile version