ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో టీపీసీసీ పంచాయితీ నడుస్తోంది. మొదటి నుంచి ఈ పదవిపై చాలామంది పోటీపడుతున్నారు. నాకంటే నాకంటూ డిమాండ్ చేస్తున్నారు. తమకు పదవి ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి పేరు వచ్చినప్పటి నుంచి రాజకీయాలు మరింత రణరంగంలా మారాయి.
అయితే ఈ పదవిపై జగ్గారెడ్డి మొన్నటి వరకు తీవ్ర స్థాయిలో పట్టబట్టారు. తనకే ఇవ్వాలంటూ సోనియా గాంధీకి లేఖ కూడా రాశారు. రేవంత్‌కు ఇస్తే తామంతా జైల్లచుట్టూ తిరగాల్సి వస్తుందని చెప్పడం సంచలనంగా మారింది. అయితే ఇప్పుడు తాజాగా ఆయన మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రీసెంట్‌గా ఆయన మాట్లాడుతూ తనకు టీపీసీసీ ఇవ్వకపోయిన పర్వాలేదంటూ వెనక్కు తగ్గారు. ఎవరికి ఇచ్చినా తామంతా రాహుల్ గాంధీ నేతృత్వంలోనే పనిచేస్తామంటూ స్పష్టం చేశారు. అయితే తనకు టీపీసీసీ ఇవ్వకపోయినా కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వీహెచ్ లాంటి సీనియర్ నేతల ఆవేదన అర్థం చేసుకోవాలంటూ కోరుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.