Unwanted hair: ముఖంపై అవాంఛిత రోమాలు, మచ్చలు, వైట్‌హెడ్స్‌ తొలగించాలంటే ఇదొక్కటి చేస్తే చాలు..!!

-

Unwanted Hair: ముఖంపై అవాంఛిత రోమాలు ఎక్కువగా ఉంటే ఆడవాళ్లకు అస్సలు నచ్చదు. వాటి కోసం హెర్బల్‌ పౌడర్లని, వ్యాక్స్‌లను ఇంకా చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. పెదాలపై, గడ్డం కింద కొందరికి హెయిర్‌ ఎక్కువగా ఉంటుంది. వీటికి ఐబ్రోస్‌తో పాటు త్రెండినింగ్‌ చేయిస్తుంటారు. కానీ ఇలా చేయడం అస్సలు స్కిన్‌కు మంచిది కాదు. ఎందుకంటే.. లిప్స్‌ దగ్గర స్కిన్‌ టాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. ఇలా చేయడం వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చే ప్రమాదం ఉంది. చాలా సింపుల్‌ హోమ్‌ రెమిడీతో ముఖంపై ఉన్న హెయిర్‌ను తొలగించుకోవచ్చు తెలుసా..? అంతేకాదు… ఈ రెమిడీతో ముక్కుపై ఉంటే వైట్‌హెడ్స్‌, బ్లాక్‌హెడ్స్‌తో పాటు ముఖంపై ఎలాంటి మచ్చలు ఉన్నా పోతాయి..! దీనికి కావాల్సిందల్లా ఒక్క ఎగ్‌ మాత్రమే..!
ముఖంపై అవాంఛిత రోమాలు తొలగించాలంటే ఏం చేయాలంటే..
ఒక గుడ్డు, టిష్యూ పేపర్‌ తీసుకోండి. ఎగ్‌వైట్‌ను ఒక గిన్నెలో వేసుకుని స్పూన్‌తో బాగా కలపండి. ఆ తర్వాత ముఖాన్ని శుభ్రంగా వాష్‌ చేసుకుని ఎగ్‌ వైట్‌ను ముఖానికి అప్లై చేయండి. ఆ తర్వాత ముఖానికి టిష్యూపేపర్‌ అప్లై చేసుకోండి. ముఖం మొత్తం అప్లై చేయకండి. మీకు ఎక్కడైతే మచ్చలు, హెయిర్‌ ఉందో అక్కడ మాత్రమే అప్లై చేయండి. మళ్లీ టిష్యూ పేపర్‌పై ఎగ్‌వైట్‌ను అప్లై చేయండి. ముక్కు మీద వైట్‌ హెడ్స్‌ ఉంటే టిష్యూ పేపర్‌ మళ్లీ వేసి దానిపై ఎగ్‌వైట్‌ను అప్లై చేయండి.
ఇలా చేసిన తర్వాత 20- 30 నిమిషాలు ఉంచండి. ఇప్పుడు గట్టిగా అవుతుంది. రివర్స్‌ డైరెక్షన్‌లో ఒకటేసారి టిష్యూపేపర్‌ను లాగేయండి. హెయిర్‌ వచ్చేస్తుంది. మొదటి ప్రయత్నంలోనే మీరు రిజల్ట్‌ చూస్తారు. ముఖంపై మచ్చలు ఉన్నా కూడా చాలా వరకూ తగ్గుతాయి. మీరు ఇదే టిప్‌ను వారానికి ఒకటి లేదా రెండు సార్లు చొప్పున నెల రోజులు కంటిన్యూగా చేయండి. మీ ఫేస్‌  అద్భుతంగా తయారవుతుంది. స్కిన్‌పైన ఉన్న ట్యాన్‌, మచ్చలు, మొటిమలు, వైట్‌ హెడ్స్‌ అన్నీ పోతాయి. ఎగ్‌ ముఖానికి అద్భుతాలు చేస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కాకపోతే.. ప్యాక్‌ వేసుకున్నప్పుడు కాస్త స్మెల్‌ వస్తుంది. తప్పదు భరించాలి..!!

Read more RELATED
Recommended to you

Latest news