జనసేనకు డిప్యూటీ స్పీకర్ తో పాటు మరో కీలక పదవి…

-

ఏపీలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ,బీజేపీతో కలిసి 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన పార్టీ ఫుల్ స్ట్రైక్ రేట్ సాధించింది. పవన్ సపోర్ట్ తో టీడీపీకి ఏపీలో ఫుల్ మైలేజీ వచ్చింది. అయితే అన్ని సీట్లను గెలిచిన జనసేనకి కేవలం మూడు మంత్రి పదవులు మాత్రమే దక్కాయి.దీంతో జనసేన కేడర్ లో అసంతృప్తి నెలకొంది.ఈ అసంతృప్తిపై పార్టీ అధినేతకు సమాచారం అందింది.అయితే జనశ్రేణులను మరింత ఉత్సాహపరిచేలా సీఎం చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ పదవిని జనసేనకి ఇవ్వనున్నట్లు సమాచారం.అలాగే మరో కీలక పదవిని సైతం కట్టబెట్టే ఆలోచనలో ఉన్నారు సీఎం.

ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు పేరు దాదాపుగా ఖరారు అయినట్లు సమాచారం.అయితే డిప్యూటీ స్పీకర్ పదవి కోసం విజయనగరం జిల్లా నెల్లిమర్లకు చెందిన లోకం మాధవి పేరు వినిపిస్తోంది.కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కూడా డిప్యూటీ స్పీకర్ పదవి రేసులో ఉన్నారు.ఈ ఇద్దరిలో మహిళగా మాధవి పేరునే జనసేన బలపరుస్తున్నట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం.స్పీకర్ గా అయ్యన్నను ఎంపిక చేసి అదే ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన మాధవికి డిప్యూటీ స్పీకర్ ఇస్తారా అనే చర్చ కూడా నడుస్తోంది. అయితే సమీకరణాల దృష్ట్యా మాధవికి ఈ పదవి కన్ ఫర్మ్ అని అంటున్నారు. అలా కేబినెట్ ర్యాంక్ హోదా కలిగిన మరో పదవి జనసేనకు లభించబోతోంది.

ఇక రెండో పదవి కూడా జనసేనకు దక్కే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు పార్టీ నాయకులు. సాధారణంగా విపక్ష పార్టీలకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి ఇస్తారు. ఇది కూడా కేబినెట్ ర్యాంక్ హోదా కలిగినది.2014లో టీడీపీ అధికారంలో ఉండగా ఈ పదవిని వైసీపీకే ఇచ్చారు.2019లో టీడీపీ విపక్షంలోకి వచ్చినప్పుడు పీఏసీ చైర్మన్ పోస్టుని టీడీపీకి చెందిన పయ్యావుల కేశవ్ కి ఇచ్చారు.కేబినెట్ ర్యాంక్ హోదాలో పయ్యావుల అయిదేళ్ల పాటు పనిచేశారు. ఇపుడు పీఏసీ చైర్మన్ పదవి విపక్షానికి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ప్రతిపక్ష హోదాయే లేదు అన్న కారణంతో ఇవ్వరనే అంటున్నారు.అలా వైసీపీకి ఇవ్వాల్సిన పదవిని జనసేనకు ఇవ్వవచ్చు అని గట్టిగా ప్రచారం సాగుతోంది. అదే కనుక జరిగే జనసేనకు మరో కేబినెట్ ర్యాంక్ పదవి దక్కుతుంది అని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news