ఈ రైలు ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ కంటే ఎక్కువే.. సౌకర్యాలు తెలిస్తే షాకే..!

-

ఒకప్పుడు ఉన్న ట్రైన్స్‌కు ఇప్పుడు ఉన్న ట్రైన్స్‌కు చాలా మార్పులు వచ్చాయి.. భారతీయ రైల్వే ప్రయాణీకుల కోసం మెరుగైన సౌకర్యాలని కల్పిస్తోంది. ఇందులో భాగంగా తేజస్ రైలు, వందే భారత్, బుల్లెట్ రైలు, మహారాజా ఎక్స్‌ప్రెస్, ప్యాలెస్ ఆన్ వీల్స్ వంటి అనేక లగ్జరీ రైళ్లని నడిపిస్తుంది. ఇందులో సౌకర్యాలు ఫైవ్ స్టార్ హోటళ్ల ఫీలింగ్‌ను కలిగిస్తున్నాయి.. అయితే తాజాగా భారతీయ రైల్వే మరో కొత్త ప్రైవేట్ రైలును ప్రారంభించింది.

దేశీయ పర్యాటకాన్ని పెంపొందించేందుకు భారత్ గౌరవ్ రైలుని ప్రారంభించింది. దీని కింద ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, దేఖో అప్నా దేశ్ వంటి ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. ఈ రైలులో ప్రయాణిస్తే కొత్త లోకానికి వెళ్లినట్లు ఉంటుందట. ఇందులో ఆహారం, పానీయాలతో సహా అనేక సౌకర్యాలను అందిస్తున్నారు..

భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ ముందు విమాన ప్రయాణం కూడా తక్కువే.. ఈ రైలు నార్త్ ఈస్ట్ సర్క్యూట్ పూర్తి చేయడానికి న్యూఢిల్లీ నుంచి బయలుదేరుతుంది. రైల్వే మంత్రిత్వ శాఖ ఈ లగ్జరీ రైలులోని వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసింది. వినియోగదారులు దీనిని చూసి చాలా ఇష్టపడుతున్నారు. ఈ రైలు ఫైవ్ స్టార్ హోటల్ కంటే తక్కువేమికాదని కొనియాడుతున్నారు. ప్రయాణిస్తున్నప్పుడు కిటికీలోంచి కనిపించే దృశ్యాలు అయితే నెక్ట్స్‌ లెవల్‌ ఉంటున్నాయి.

ఇది అస్సాంలోని గౌహతి, శివసాగర్, ఫర్కటింగ్, కాజిరంగా, త్రిపురలోని ఉనకోటి, అగర్తల, ఉదయపూర్, నాగాలాండ్‌లోని దిమాపూర్, కొహిమా, మేఘాలయలోని షిల్లాంగ్, చిరపుంజీకి చేరుకుంటుంది. మీరు ఈ రైలులో ప్రయాణించాలంటే ఢిల్లీ, ఘజియాబాద్, అలీఘర్, తుండ్లా, ఇటావా, కాన్పూర్, లక్నో, వారణాసి నుంచి బోర్డింగ్, డి-బోర్డింగ్ చేయవచ్చు

టికెట్‌ కాస్ట్ ఎంతంటే..

ఈ రైలు ఛార్జీ గురించి మాట్లాడితే AC-2-టైర్‌లో ఉన్న వ్యక్తికి రూ.1,06,990 నుంచి ప్రారంభమవుతుంది. AC-1 క్యాబిన్‌లో రూ.1,31,990, AC-1 కూపేలో రూ. 1,49,290 ఉంటుంది. ఈ ఛార్జీలో హోటల్ బస, శాఖాహార ఆహారం నగరాల్లో స్టాప్‌ఓవర్‌లు, ప్రయాణ బీమా పొందుతారు. రైలులో డైనింగ్ రెస్టారెంట్ ఈ టూరిస్ట్ రైలులో మినీ లైబ్రరీ, ఫైన్ డైనింగ్ రెస్టారెంట్‌తో సహా అనేక సౌకర్యాలు ఉంటాయి. రైలులోని అన్ని కోచ్‌లలో సీసీ కెమెరాలు, ఎలక్ట్రానిక్ సేఫ్‌లు, సెక్యూరిటీ గార్డులను మోహరించారు. మీరు IRCTC వెబ్‌సైట్ https://www.irctctourism.comలో దీని గురించి మరింత సమాచారాన్ని పొందవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version