పులులు, సింహాలను క్రూరమృగాలు అంటారు. అడివికి రాజుగా సింహాన్నే చెప్తారు. ఎందుకు పులిని చెప్పరు. రెండు వేటాడటంలో నెంబర్ వన్‌గా ఉంటాయి.. ఈరోజు మనం పులి గురించి కొన్ని ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం.. కచ్చితంగా మీరు షాక్ అవుతారు.
ఇతర పులుల కంటే రాయల్ బెంగాల్ టైగర్లు అతి పెద్దవి. వీటిలో మగ పులులు 300 కిలో గ్రాముల వరకు బరువు ఉంటాయి. ఇంతటి బరువుతో అది ఏ మామూలు జీవి మీదనైనా కూర్చుంటే దీని బరువుకే అది ఊపిరి ఆడకుండా చనిపోతుంది.
పులుల శరీర పరిమాణాన్ని పక్కన పెడితే, వాటి ముందు కాళ్లను చూడండి. పులి ఎప్పుడూ దాని పంజా దెబ్బతో దాడి చేస్తుంది. పులి పంజా దెబ్బ చాలా బలంగా ఉంటుంది. దాని ఒక్క పంజా దెబ్బతోనే ఒక వ్యక్తిని లేదా జంతువును చంపేస్తుంది. ఒక వేళ చావు మిస్ అయితే ఎముకలు విరగటం ఖాయం.
పులులను సైలెంట్ కిల్లర్లుగా వర్ణిస్తారు తెలుసా..? ఎందుకంటే చాటు నుంచి వచ్చి ఆకస్మికంగా దాడి చేస్తుంది. వేటాడేటపుడు పులులు చాలా నిశ్శబ్దంగా నడుస్తాయట. ఇందుకోసం మృదువైన కాలి ప్యాడ్‌లను కలిగి ఉంటాయి. పులి చారలు దాని చుట్టూ ఉన్న పరిసరాలతో కలిసిపోయేలా మభ్యపెట్టేలా పనిచేస్తాయి, ఇలా నెమ్మదిగా ఎరను వెంబడించి, మెరుపుదాడి చేస్తాయి. పులులు నిశాచర జీవులు కూడా ఎక్కువగా రాత్రి వేళలోనే వేటకు వెళ్తుంది. ఈ వేటలో భాగంగా సుమారు 10- 20 కిమీ ప్రయాణిస్తుందట.
పులుల ఆయుర్దాయం 20-25 సంవత్సరాల మధ్య ఉంటుంది. చాలా పులులు 20 ఏళ్లలోపే మరణిస్తాయట. పులి పిల్లలు గుడ్డిగా పుడతాయి, పుట్టిన వాటిలో కొన్ని మాత్రమే జీవిస్తాయి. పులి పిల్లలు కేవలం తమ తల్లి సువాసనను మాత్రమే అనుసరిస్తాయి. చాలా పులి పిల్లలు ఆకలితో లేదా చలికి చనిపోతాయి. కొన్నిసార్లు ఆడపులి, మగపులికి సంభోగానికి అనుమతిని ఇవ్వకపోతే అవి దాని పిల్లలను తినేసి ఆడపులిని లోబర్చుకుంటాయట. ఇలా కూడా పులి పిల్లలు చనిపోతాయి.
పులుల మూత్రం వాసన, అచ్ఛంగా వెన్న పూసిన పాప్‌కార్న్ వాసన లాగా ఉంటుంది. అయితే ఈ వాసన చూడటాని ప్రయత్నించవద్దు. ఎందుకంటే పులులు తమకోసం ప్రత్యేకమైన టెరిటరీలను ఏర్పర్చుకొని జీవిస్తాయి. తమ భూభాగంలోకి ఏదైనా వస్తే ఇక అంతమే..!
పులులు ఎప్పుడూ ఒకేరకమైన ఆహారాన్ని తినవు. అన్ని రుచులను ఆస్వాదిస్తాయి. అడవి పంది, జింక, ఎలుకలు, ఎలుగుబంటి, పక్షులు, ఖడ్గమృగం, మొసలి, గేదె, చిరుతపులి వంటి వాటిలో దేనితో అయినా విందు చేసుకోగలవు. అలాగే దాని మార్గంలో వచ్చే ఏ జీవినైనా చంపి తింటాయి. చేపలను కూడా తింటుంది. ఎందుకంటే పులులకు ఈతకొట్టడం ఇష్టం సుమారు 30 కిమీ దూరం వరకు ఈతకొట్టగలవు ఈ క్రమంలో ఆకలి వేస్తే చేపలను తినేస్తాయి.
పులులు సాధారణంగా మనుషులను ఆహారంగా పరిగణించవు. కానీ, మనిషి వాటికి ముప్పు అని అనిపించినపుడు చంపి తినేస్తాయి. అయితే ఇలా ఒకసారి మనిషి రక్తం మరిగిన పులి, మళ్లీ మళ్లీ మనిషి మాంసం కోసం నోరూరుతాయి. అయినప్పటికీ వాటి భూభాగంలోకి మనిషి చొరబడకపోతే ఏం చేయవు. పొరపాటున ఒకవేళ మనిషికి పులి ఎదురైతే భయంతో పరుగెత్తకుండా, పులిని కన్నార్పకుండా చేస్తూ వెనకకు నడుచుకుంటూ కనుమరుగవడం సరైన చర్య.