మనుషుల మధ్య మనస్పర్ధలను తీసుకొచ్చే శక్తి డబ్బుకి ఎక్కువగా ఉంది. అందుకే డబ్బుతో డీల్ చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా స్నేహితులకు అప్పుగా డబ్బు ఇచ్చినప్పుడు.. చాకచక్యంగా తిరిగి రప్పించుకోవాలి.
చాలామంది స్నేహితులకు అప్పుగా డబ్బులు ఇస్తుంటారు. కానీ ఎలా అడగాలో తెలియక మొహమాటానికి పోయి డబ్బుల్ని పోగొట్టుకుంటారు.
ప్రస్తుతం స్నేహితుడికి అప్పుగా డబ్బు ఇస్తే దాన్ని రికవరీ చేయడానికి ఎలాంటి ట్రిక్స్ పనిచేస్తాయో తెలుసుకుందాం.
సాధారణ సంభాషణ కోసం సమావేశం:
మీరు మీ స్నేహితుడిని డైరెక్ట్ గా డబ్బు అడగకండి. దానివల్ల అతను ఇబ్బంది పడే అవకాశం ఉంది. అలా కాకుండా క్యాజువల్ టాక్ కోసం మీటింగ్ ఏర్పాటు చేయండి. ఫోన్ లో మాట్లాడకుండా పర్సనల్ గా కలవండి. అలా కలిసినప్పుడు డైరెక్ట్ గా డబ్బు టాపిక్ తీసుకురాకుండా మామూలు సంభాషణ జరుపుతూ ఉండాలి.
కూల్ గా డబ్బు విషయం గుర్తు చేయండి:
మామూలు సంభాషణ జరుపుతున్నప్పుడే డబ్బు సంగతిని గుర్తు చేయండి. అది కూడా డైరెక్ట్ గా కాకుండా.. మీరు జరుపుతున్న సంభాషణలోంచి టాపిక్ వచ్చినట్టుగా చేయండి. ఇది చాలా సహజంగా ఉండాలి. ఒకవేళ మీరు ఓవర్ యాక్టింగ్ చేస్తే మీ ఫ్రెండ్.. మీరు కావాలనే డబ్బు విషయం గుర్తు చేస్తున్నారని గుర్తుపట్టే అవకాశం ఉంది.
మీ అవసరాలను వెల్లడి చేయండి:
ఒకసారి డబ్బు టాపిక్ తీసుకు వచ్చిన తర్వాత మీకు దానితో ఎలాంటి అవసరాలు ఉన్నాయో వాళ్లకి తెలియజేయండి. స్కూల్ ఫీజులు, ఇంట్లో పెద్ద వాళ్లకు హాస్పిటల్ ఖర్చులు.. వంటి వాటిని చెప్తే అవతలి వాళ్లకు డబ్బు కట్టాలన్న ఫీలింగ్ వస్తుంది.
ఒక డేట్ ఫిక్స్ చేయండి:
ఎట్టకేలకు డబ్బు టాపిక్ తీసుకొచ్చేశారు. వెంటనే డబ్బు ఇవ్వమనకుండా ఒక డేట్ ఇవ్వండి.
ఆ తేదీలోగా డబ్బు అడ్జస్ట్ చేయమని చెప్పండి. ఇదంతా సాధారణ సంభాషణలాగే జరగాలి. అవతలి వాళ్లను హెచ్చరిస్తున్నట్లుగా జరగకూడదు.