ప్రపంచానికి నీతులు చెప్పే రవిప్రకాశ్.. అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారాడు. టీవీ9 వ్యవస్థాపకుడిగా ఆయన ఎటువంటి పెట్టుబడి పెట్టకుండానే.. 8 శాతం వాటా ఇచ్చారు. కానీ.. మొత్తం నాలుగు చానెళ్లను గుప్పిట పెట్టుకొని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డాడని చెప్పడానికి ఆయన ప్రారంభించిన చానెళ్లే నిదర్శనం.
మామూలుగా రవిప్రకాశ్ అంటే అర్థం కాకపోవచ్చు కానీ.. టీవీ9 రవిప్రకాశ్ అంటే బాగా అర్థమవుతుంది. ఆయన్ను టీవీ9 సీఈవో పదవి నుంచి తీసేసినట్టు ఏబీసీఎల్ యాజమాన్యం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నిజానికి ఆయనలో కనిపించని మరో మనిషి కూడా ఉంటాడట. ఆ మరో మనిషి దందాలు, చందాలు, బ్లాక్ మెయిలింగ్ చానెల్ బాధితులు చాలామందికి తెలుసట.
అయితే.. ఇదంతా బయట. బయటి వ్యక్తులను మోసం చేయడం. కానీ.. సొంత కంపెనీని కూడా మోసం చేసే మాయగాడు రవిప్రకాశ్ అనే విషయాన్ని మాత్రం ఎవరూ గ్రహించలేకపోయారు. సరే.. ఇప్పుడు అసలు విషయానికి వస్తే… గత సంవత్సరం తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, మొన్న తెలంగాణ, ఏపీలో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో టీవీ9లో వివిధ షోలు చేసి దాదాపు 50 కోట్లు వసూలు చేశాడట రవిప్రకాశ్. అవన్నీ మనోడి ఖాతాలోనే వేసుకున్నాడట.
అంటే వాటిని కంపెనీ ఖాతాలో జమచేయలేదన్నమాట. ఇప్పుడు ఆయన్ను తొలగించాక.. ఆ డబ్బుకు సంబంధించిన వివరాలను కంపెనీ సేకరిస్తోందట. దారి మళ్లిన కోట్లాది రూపాయలను రవి ప్రకాశ్ ఏ అకౌంట్లలో వేశాడో కంపెనీ ఆరా తీస్తున్నదట. అయితే.. అది ఈ ఒక్కసారి జరిగింది కాదు.. ఎప్పటి నుంచో అభ్యర్థుల నుంచి డబ్బులు తీసుకొని వాటిని కంపెనీ ఖాతాలో జమ చేయకుండా.. తమ ఖాతాల్లోకి మళ్లించుకునేవాడని చెబుతున్నారు.
ప్రపంచానికి నీతులు చెప్పే రవిప్రకాశ్.. అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారాడు. టీవీ9 వ్యవస్థాపకుడిగా ఆయన ఎటువంటి పెట్టుబడి పెట్టకుండానే.. 8 శాతం వాటా ఇచ్చారు. కానీ.. మొత్తం నాలుగు చానెళ్లను గుప్పిట పెట్టుకొని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డాడని చెప్పడానికి ఆయన ప్రారంభించిన చానెళ్లే నిదర్శనం. ఇప్పటికే మోజో చానెల్, భారత్ వర్ష్ అనే రెండు చానెళ్లను ప్రారంభించాడు. దక్షిణాఫ్రికాలో ఆయన చాలా పెద్ద ఎత్తున వ్యాపారాలు చేస్తున్నట్టు కూడా విమర్శలు ఉన్నాయి. కట్నం అడిగేవాడు గాడిద అని చెప్పే రవిప్రకాశ్.. చివరకు మెజారిటీ వాటాదారులను కంపెనీలోకే రాకుండా చేసేందుకు ఫోర్జరీ చేయడానికి కూడా వెనుకాడలేదు. అంతలా దిగజారాడంటే.. తన అవినీతి సామ్రాజ్యం ఎంతలా విస్తరించిందో తెలుసుకోవచ్చు.
తనపై అబద్ధాలు, పుకార్లు ప్రచారం చేశారని.. ఏకంగా టీవీ9 న్యూస్ రూమ్‌లోకి దూరి వివరణ కూడా ఇచ్చుకున్నాడు. దొంగ ఏడుపు ఏడ్చాడు. మొసలి కన్నీరు కార్చాడు కానీ.. అవేమీ వర్కవుట్ కాలేదు. చివరకు సీఈవో పదవి నుంచి ఊస్ట్ అయిపోయాడు. ఇక.. ఫోర్జరీ కేసులో సరైన ఆధారాలు దొరికితే.. జీవితాంతం రవిప్రకాశ్ జైలు ఊచలు లెక్కబెట్టాల్సిందే.