ఎక్కడైన ఇల్లు అనేవి ఒక ఊరిలో,ఒక రాష్ట్రంలో ఉంటాయి.. ఆ రాష్ట్ర గుర్తింపును కూడా పొందుతారు.. కానీ రెండు దేశాలల్లో కాకుండా రెండు రాష్ట్రాల్లో ఒక ఇల్లు ఉండటం అసలు విని ఉండరు..వాళ్ళు మాత్రం రెండు రాష్ట్రాల లబ్దిని పొందుతున్నాము.. మాకు ఎటువంటి భాధలు లేవని చెప్పడం విశేషం.. ఇప్పుడు అలాంటి ఇంటి గురించి మనం తెలుసుకుందాం…
రెండు రాష్ట్రాల్లో ఉన్న ఆ ఇల్లు మహారాష్ట్ర ఆ ఇంటి గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆ ఇంట్లో ఒక భాగం మహారాష్ట్రలో, మరొక భాగం తెలంగాణలో ఉంది. అవును అండి బాబు.. మీరు విన్నది అక్షరాల నిజం.. అతను రెండు రాష్ట్రాలకు పన్ను కూడా కడుతున్నారట..రెండు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రత్యేకమైన ఇంటి గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా పెద్ద చర్చ జరుగుతోంది.
చంద్రపూర్ జిల్లా మహారాజ్‌గూడ గ్రామం లో ఉన్న ఈ ఇల్లు రెండు రాష్ట్రాల మధ్య అంటే మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల మధ్య ఉంది. దీని 4 గదులు మహారాష్ట్రలో, 4 గదులు తెలంగాణలో ఉన్నాయి. దాంతో రెండు రాష్ట్రాలకు పన్నులు కడుతున్నారు యజమాని ఉత్తమ్ పవార్.. అంతేకాదు.. తనకు ఎలాంటి ఇబ్బంది లేదని అంటున్నారు. అంతేకాదు.. రెండు రాష్ట్రాల ప్రయోజనాలను పూర్తిగా పొందుతున్నామని చెబుతున్నారు..
ఇకపోతే తన ఇంట్లో 13 మంది కుటుంబ సభ్యులు వున్నట్లు ఆయన చెబుతున్నారు.. తెలంగాణలో వంటగది, మహారాష్ట్రలో హాల్ ఉన్నాయి. కాగా, తన సోదరుడి గది తెలంగాణలో ఉంది.1969 లో సర్వేలో తన ఇంట్లో సగం మహారాష్ట్రలో ఉందని, మిగిలిన సగం తెలంగాణలో కి వెల్లిందని ఆయన తెలిపారు.. ఏది ఏమైనా ఈ ఇల్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.