కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. చాలా మంది ఈ స్కీమ్స్ బెనిఫిట్స్ ని పొందుతున్నారు. దేశంలోని పేదలకు సహాయం చేయడానికి కూడా కేంద్రం ఎన్నో స్కీమ్స్ ని ప్రవేశ పెట్టింది. అయితే వాటిలో ఉజ్వల యోజన కూడా ఒకటి. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన స్కీమ్ ని మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చింది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..
గ్రామీణ, నిరుపేద కుటుంబాలకు ఎల్‌పీజీ వంటి స్వచ్ఛమైన వంట ఇంధనాన్ని తీసుకు రావాలనే ఈ స్కీమ్ ని తీసుకు వచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందికి ఈ స్కీమ్ ద్వారా గ్యాస్ కనెక్షన్ వచ్చింది. ప్రతి కనెక్షన్ గ్యాస్ స్టవ్ కొనుగోలు, సిలిండర్ రీఫిల్ కోసం వడ్డీ రహిత రుణం ఈ స్కీమ్ కింద పొందొచ్చు.
ఉజ్వల యోజన స్కీమ్ ని ఎవరు అర్హులు…?
భారతీయ పౌరులు అర్హులే. వయస్సు 18 ఏళ్లు నిండి ఉండాలి.
ఉజ్వల యోజన స్కీమ్ కి ఎల్‌పీజీ కనెక్షన్ లేని బీపీఎల్ కుటుంబానికి చెందిన మహిళలే అర్హులు.
ఇంకే పథకాల కింద ఎలాంటి ప్రయోజనం పొంది ఉండకూడని వారే అర్హులు.
బ్యాంకు అకౌంట్ ఉండాలి.
ఎస్సీ/ఎస్టీ కింద ఎస్‌ఈసీసీ 2011 లేదా బీపీఎల్ కుటుంబాల జాబితాలో చేర్చిన లబ్ధిదారులు ఈ పధకం ని పొందొచ్చు. అలానే పీఎంఏవై, ఏఏవై మరియు అత్యంత వెనుకబడిన తరగతులు కూడా ఈ స్కీమ్ బెనిఫిట్స్ పొందొచ్చు. అటవీ నివాసులు, నదీ ద్వీపాలలో నివసించే వ్యక్తులు కి కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది.
https://www.pmuy.gov.in/ujjwala2.html ద్వారా అప్లై చేసుకోవచ్చు.