ఉచితంగా మట్టి కావాలని ఫేస్ బుక్ లో పెట్టినందుకు.. 100 లారీలు తెచ్చిపోశారు కానీ..

-

యూఎస్ లోని వర్జీనియా సమీపంలో ఉన్న స్ప్రింగ్ ఫీల్డ్ లో రోజ్ మేరీ వేగా అనే యువ‌తి త‌న ఇంటి చుట్టుప‌క్క‌ల‌ ఉన్న యార్డ్‌ను చదును చేయాలని, అందుకు ఉచితంగా మట్టి కావాలని ఓ యాడ్ త‌న ఫేస్ బుక్‌లో పెట్టింది. అయితే ఆ పోస్టుతో తాను కొత్త‌ క‌ష్టాన్ని కొని తెచ్చుకున్న‌ట్టు అయింది. ఆమె పోస్ట్ పెట్టిన మరుసటి రోజు నుంచి జనాలు మట్టి తెచ్చి ఆమె యార్డ్ లో పోయడం ప్రారంభించారు. ఒక ట్రక్ 10 ట్రక్ లయింది. 10 ట్రక్ లు 50 ట్రక్కులయ్యాయి. మొత్తం మీద 100 ట్రక్కులకు పైగా మట్టిని ఆమె యార్డులో పోసేసి వెళ్లిపోయారు జనాలు.

వారు తెచ్చిచ్చిన ఇసుక దాదాపు 11 వేల చదరపు అడుగుల విస్తీర్ణానికి విస్తరించింది. ఆ ఆవరణలోని 13 చెట్లు ధ్వంసం అయ్యాయి. దీంతో అవాక్కైన ఆమె, అవసరం లేని మట్టిని తొలగించడానికి 2. లక్షల డాలర్లను ఖర్చు చేయాల్సి వచ్చిందట. ఈ మొత్తం ఘటన ఆమె కళ్ల వెంట నీటిని తెప్పించింది. భర్తకు దూరమై, హౌస్ క్లీనింగ్ వ్యాపారాన్ని నడుపుకుంటున్న తనకు, ఈ మట్టి వ్యవహారం పెద్ద చిక్కునే తెచ్చి పెట్టిందని వాపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version