ఓరి నాయనో.. వీడెవండి బాబు ఒళ్ళంతా తేనెతీగలతో తిరుగుతున్నాడు..వీడియో..

-

సోషల్ మీడియాలో క్రేజ్ కోసం కొంతమంది వివిధ రకాల పనులను చేస్తున్నారు.. అందులో కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని మాత్రం అశ్చర్యానికి గురిచేస్తున్నాయి.. ఫెమస్ అవ్వడానికి ఓ వ్యక్తి తేనేటీగల తో పెద్ద సాహసం చేశారు.. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

ఈ వీడియో మీకు ఖచ్చితంగా చెమటలు పట్టిస్తుంది. ఈ వీడియోలో, ఒక బాలుడు తన ఎడమ చేతిపై ఏకంగా తేనేటీగల పుట్టనే మోస్తూ తిరుగుతున్నాడు. అతడు ఎక్కడికి వెళితే.. అక్కడికి తనతో పాటుగా ఆ తేనెటీగలు కూడా మోసుకుంటూ వీధిలో నడుస్తున్న దృశ్యాలు నెటిజన్లు షాక్‌ అయ్యేలా చేస్తున్నాయి. ఈ ఘటన అమెరికాలో జరిగినట్లు సమాచారం. మీడియా కథనాల ప్రకారం, ఈ బాలుడు తేనెటీగల పెంపకంతో తేనె వ్యాపారం చేస్తున్నాడు. అయితే తేనెటీగలు అతనికి ఇలా అంటుకోవడం నిజంగా షాకింగ్‌గా ఉంది..

నిజానికి ఆ తేనేటీగలు ఎవరినైనా అంటుకుంటే అస్సలు వదలవు..అవి కుడితే రెండు మూడు రోజుల వరకు భరించలేని నొప్పి ఉంటుంది.. వైరల్‌ అవుతున్న వీడియోలో మాత్రం యువకుడి ఎడమచేతిపై తేనెటీగలు తేనెతుట్టేనే ఏర్పాటు చేసుకున్నాయి. పైగా అతను పిడికిలి బిగించి నడుస్తుంటే.. మిగిలిన తేనెటీగలు అతని చేతికి వేలాడుతున్నాయి. అయితే దీని వెనుక కారణం ఎంటన్నది బయటపడటంతో అందరూ షాక్ అయ్యారు. ఈ తేనెటీగలు అతడు చేసిన ఒక గొప్ప ఉపాయంతో ఇలా అతని కంట్రోల్లోకి వచ్చినట్లు అంటున్నారు.. మరో విషయం ఏంటంటే అతని చేతిలో రాణి ఈగ కూడా ఉన్నట్లు సమాచారం. అతను తేనెటీగల పెంపకం కూడా చేపడుతున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా అతని ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే.. మీరు ఆ వీడియో పై ఒక లుక్ వేసుకోవాల్సిందే..

Read more RELATED
Recommended to you

Exit mobile version