వీడియో వైరల్‌: అడవిలో రణరంగం.. ఇద్దరు పులుల భీకర యుద్ధం..!

-

దట్టమైన అటవీ ప్రాంతాల్లో జంతువుల పోరాటాలు చూస్తే ఒళ్లు గుబ్బురపొడుస్తాయి. ఆవేశంలో ఒకరినొకరు చంపేందుకు కూడా వెనకాడవు. ఒంటిపై రక్తం మరకలు కారుతున్నా.. నేనే గెలవాలనే కసితో పోరాటం చేస్తుంటాయి. ఇలాంటి గొడవలు జంతువుల్లో సర్వసాధారణం. కొన్ని జంతువులు తమ సమూహ నాయకుడి తేల్చుకునేందుకు యుద్ధం చేస్తుంటాయి. యుద్ధంలో గెలిచాక.. ఆ జంతువు సమూహానికి లీడర్ గా కొనసాగుతాయి. ఇప్పటివరకు సింహాలు, కోతులు, దున్నపోతులు వంటి జంతువుల పోరాట విన్యాసాలనే చూసి ఉంటారు. కానీ పులులు గొడవకు దిగిన దాఖలాలు చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. కానీ ఈ రెండు పులల భీకర యుద్ధానికి ప్రాంత సరిహద్దు కారణమట.

tiger

చాలా అరుదైన ఘటనలల్లో మాత్రమే పులులు పోరాటాలు చేస్తాయి. ఒక్కసారి కోపంగా పంజా విసిరితే ఇక అంతే సంగతులు. వాటి గర్జన, పంజా దెబ్బ, ఉరికే జోరును చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. రణతంబోర్ జాతీయ అభయారణ్యం అడవి పులులకు ప్రసిద్ధి. తాజాగా వైల్డ్ లీక్స్ అనే ట్విట్టర్ ఖాతాలో తాజాగా ఓ వీడియో అప్లోడ్ చేశారు. దాన్ని చూసిన నెటిజన్లు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. ఆ రెండు పులుల పోరాటం వారిని షాక్ కి గురి చేసింది.

పులులు ఎక్కడ ఉంటే అక్కడ వాటికి నచ్చిన స్థలాన్ని ఎంచుకుంటాయి. ఆ ప్రాంతంలోనే విహరిస్తాయి. అక్కడే పడుకుంటాయి. అదే ఆ ప్రాంతంలో వేరే పులి ఎంటర్ అయితే.. వార్ జరగాల్సిందే. ప్రతీ పులీ తమకుంటూ ఉన్న కొంత పరిధి ప్రాంతంలో వేరే పులులు ప్రవేశించకుండా చెట్ట బెరళ్లను చీల్చి.. ఇదీ నా ఏరియా అని గర్వం తిరుగుతుంటాయి. ఆ పంజా గీతలు దాటి మరో పులి ఆ ప్రాంతంలో ప్రవేశించకూడదు. పొరపాటున వస్తే ఆ ప్రాంతం రణరంగంగా మారుతుంది.

రణతంబోర్ జాతీయ అభయారణ్యంలోని ఈ రెండు పులుల పేర్లు రిద్ధి, దాని. ఈ రెండు పులులు అక్కా చెల్లెల్లు. ఈ వీడియోలో గొడవ పడింది ఈ ఇద్దరు అక్కచెల్లెల్లే. ఈ యుద్ధంలో రిద్ధి ఓడిపోయి.. ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ కూడా చేయించుకుంటుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version