వైరల్: ‘నా పొట్ట.. నా ఇష్టం’.. మౌత్ పబ్లిసిటీ కోసమే..!

Join Our Community
follow manalokam on social media

కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలంటే పబ్లిసిటీ చాలా అవసరం. మార్కెట్‌లో తమ హోటల్‌కు మంచి క్రేజ్ సంపాదించుకునేందుకు నిర్వాహకులు ఎంతో డిఫరెంట్‌గా పేర్లు పెడుతున్నారు. మొదట్లో కొత్త హోటల్ ప్రారంభించి.. కొన్ని నెలలు గడిచిన తర్వాత ఫుడ్ టేస్ట్ బాగుంటే ఆటోమెటిక్‌గా వ్యాపారం పుంజుకునేది. కానీ ప్రస్తుతం వ్యాపార నిర్వాహకులు మౌత్ పబ్లిసిటీకే ఓటు వేస్తున్నారు. క్రియేటివిటీతో కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. తమ హోటళ్లుకు డిఫరెంట్‌గా పేర్లు పెట్టి సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా ప్రయత్నిస్తున్నారు.

resturent

మర్యాద, మమకారం, వెటకారానికి మారుపేరైన గోదారోళ్లకు ఇలాంటి వెరైటీ హోటళ్లు ఉండటం మనం చూస్తునే ఉంటాం. ఇప్పటికే కాకినాడలో సుబ్బయ్య గారి హోటల్, విజయవాడలోని బాబాయ్ హోటల్ ఎంతో ఫేమస్. తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరును సంపాదించుకున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో తిన్నంత భోజనం, సెకండ్ వైఫ్, వివాహ భోజనంబు వంటి పేర్లతో ఉన్న హోటళ్లు వైరల్ అవ్వడమే కాకుండా మంచి పేరును సంపాదించుకున్నాయి.

తాజాగా రాజమండ్రిలో ‘పొట్ట పెంచుకుందాం’ హోటల్ కూడా బాగా పాపులారిటిని దక్కించుకుంది. ఇప్పుడు ఇదే బాటలో మరో హోటల్ వచ్చింది. ‘నా పొట్ట నా ఇష్టం’ అనే హోటల్ రాజమండ్రిలోని దానవాయిపేటలో ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం ఈ హోటల్ అందరినీ ఆకర్షిస్తోంది. ఈ హోటల్ ఫోటోలు స్థానికంగా, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ‘అవర్ రాజమహేంద్రవరం’ అనే ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేసిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ హోటల్ పేరుపై పలు జోకులు వేసుకుంటున్నారు.

 

హోటల్ పేరుపై నెటిజన్లు ఆకర్షితులవుతున్నారు. ఆహారంలో నాణ్యత పాటిస్తే.. తప్పకుండా వ్యాపారం పుంజుకుంటుందని కొందరు. మున్ముందు ఇంకా ఎలాంటి పేర్లతో హోటళ్లు వస్తాయోనని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ‘బ్రేవ్, ఇంకొంచె వేసుకో.. తింటే తిను.. తిని చూడు.. నీ యబ్బా వచ్చి తినరా.. నచ్చితే తిను లేదా దొబ్బెయ్.’’ వంటి పేర్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

TOP STORIES

భక్తి: మాఘ పౌర్ణమి నాడు ఏం చెయ్యాలి..?

మాఘ పౌర్ణమి చాల ప్రత్యేకమైన రోజు. ఆరోజు హిందువులు ప్రత్యేక పూజలు చేయడం, నదీ స్నానాలని చేయడం చేస్తారు. అలానే ధానం చేయడం మొదలైన వాటిని...