వెయిట్రెస్ షాక్: బిల్లు 205.. టిప్పు 5000 డాలర్లు..!

-

వాషింగ్టన్: పెద్ద పెద్ద రెస్టారెంట్లలోకి వెళితే వెయిటర్స్ ఫుడ్ ఆడర్ తీసుకున్నప్పటిని నుంచి తిని చేతులు కడుక్కునేంత వరకూ కస్టమర్లకు ఫుడ్ సర్వ్ చేస్తూ ఉంటారు. హోటల్ యాజమాన్యం జీతాలు అందజేసినా.. కస్టమర్లు తమకు తోచినంత టిప్పు ఇచ్చి వెళ్తుంటారు. ఎక్కువ మంది వంద రూపాయలలోపే టిప్పు ఇస్తారు. చాలా అరుదుగా కొందరూ వేల వరకు టిప్పు ఇస్తారు. కానీ లక్షల రూపాయల టిప్పు ఇవ్వడం గురించి ఎప్పుడైనా విన్నారా.. లేదు కదూ. కానీ ఓ వ్యక్తి ఏకంగా 5000 డాలర్ల టిప్పు ఇచ్చి వెయిట్రెస్ ను ఆశ్చర్యపరిచాడు.

bill

ఈ సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది. చెస్టర్లోని వైడెనర్ విశ్వవిద్యాలయంలో నర్సింగ్ చదువుతున్న జియానా.. డిఏంజెలో పెన్సిల్వేనియాలోని ఓ ఇటాలియన్ రెస్టారెంట్ లో వెయిట్రెస్ గా పని చేస్తోంది. నర్సింగ్ చదువుకుంటూ పార్క్ టైం వర్క్ చేస్తూ.. రోజూలాగే రెస్టారెంట్ కు వెళ్లింది. శనివారం ఓ వ్యక్తి తన స్నేహితులతో కలిసి రెస్టారెంట్ కు వచ్చాడు. ఫుడ్ ఆర్డర్ చేసి తిన్నాడు. బిల్లు 205 డాలర్లు అయింది. అంటే మన కరెన్సీలో రూ.15,058 అయింది. జియానా బిల్ తీసుకొచ్చి ఇచ్చి వెళ్లిపోయింది. కస్టమర్ బిల్లుతో పాటు అదనంగా 5000 డాలర్లు టిప్పు పెట్టి వెళ్లిపోయాడు.

జియానా మనీ తీసుకోవడానికి వెళ్లినప్పుడు బిల్లుతో పాటు భారీ మొత్తంలో టిప్పు చూసి షాక్ కు గురైంది. 5000 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.3,67,287. అంత మొత్తం డబ్బులు మర్చిపోయి ఉంటాడని భావించి జియానా డబ్బులు తిరిగి ఇచ్చేసేందుకు చూసింది. కానీ అప్పటికే ఆ కస్టమర్ వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని హోటల్ యజమానికి తెలిపింది. దీంతో ఆయన ఫేస్ బుక్ లో బిల్ షేర్ చేశాడు. ఆ రిసిప్ట్ లో బిల్లు దగ్గర 205 డాలర్లు ఉండగా.. టిప్పు దగ్గర 5000 రాసి ఉంది. మొత్తంగా 5,205 డాలర్లు ఉన్నాయి. ఇంత భారీ మొత్తంలో టిప్పును అందుకున్న జియానా ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. ప్రస్తుతం ఈ బిల్లు పేపర్ సోషల్ మీడియాలో హల్ చల్ అవుతోంది. పలువురు నెటిజన్లు సదరు కస్టమర్ ను ప్రశంసలతో ముంచేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version