28 ఏళ్లలో 24 పెళ్లిళ్లు.. భార్యకు తెలియడంతో చివరకు..!

వయసుకు మించిన మాటలు.. వయసుకు మించిన తెలివి అనే మాటలు వినుంటాం. కానీ వయసుకు మించిన వివాహాలు అనేది ఎప్పుడైనా విన్నారా. ఈ స్టోరీ చదివితే అదీ నిజమే అనిపిస్తుంది. ఇంతకీ వయసుకు మించిన వివాహాలేంటి అనుకుంటున్నారా. ఎందుకు ఆలస్యం ఈ స్టోరీ చదివేయండి.

అసబుల్​ మొల్లా అనే వ్యక్తి బంగాల్​లోని సాగర్​దిగీ ప్రాంతానికి చెందిన ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన కొన్నేళ్ల వరకు బాగానే ఉన్నాడు. ఆ తర్వాత ఇంట్లో నుంచి నగలు తీసుకుని పారిపోయాడు. భర్త మోసం చేశాడని సాగర్​దిగీ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది మహిళ. దీంతో అతడి నిర్వాకం బయటపడింది.

నకిలీ గుర్తింపు కార్డులను అవలీలగా సృష్టించి బిహార్​, పశ్చిమ బంగాల్​​లోని పలు ప్రాంతాల్లో అసబుల్​ తిరిగేవాడు. ఒక చోట అనాథ అని, మరోచోట జేసీబీ డ్రైవర్​ అని, ఇంకో చోట కూలీ ఇలా పేర్లు మార్చుకుంటూ తిరిగేవాడు. అలా 28 ఏళ్ల వయసులో 24 పెళ్లిల్లు చేసుకున్నాడు.

పెళ్లయిన కొన్నాళ్లకు ఇంట్లోని నగలు, డబ్బులు తీసుకుని అక్కడనుంచి పరారయ్యేవాడు. ఇలా 23 మందిని మోసం చేసి సాగర్​దిగీలోని 24వ మహిళను వివాహం చేసుకున్నాడు. ఎప్పటిలాగే తన చేతి వాటం చూపించి పరారయ్యాడు అసబుల్​. కానీ ఈ సారి మనువాడిన అమ్మాయి అతనిపై ఫిర్యాదు చేయడం వల్ల దొరికిపోయాడు. నిందితుడిని అదుపులోకి తదుపరి విచారణను జరుపుతామని పోలీసులు తెలిపారు.